- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సాగు చట్టాల రద్దు వెనకాల బ్రోకర్ల హస్తం.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో : మూడు నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంపై ప్రతిపక్ష పార్టీలతోపాటు దేశంలోని పలు రాజకీయ పక్షాలు చేస్తున్న విమర్శలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చట్టాలను రద్దు చేయాలని కోరిన రైతులే రాబోయే రోజుల్లో చట్టాలు కావాలని ప్రధాని మోడీని కోరుతారని శుక్రవారం సోషల్మీడియా వేదికగా వెల్లడించారు.
చట్టాలు రద్దు చేసిన సందర్భంగా బ్రోకర్లకు శుభాకాంక్షలంటూ పేర్కొన్నారు. అనంతరం బ్రోకర్లకు ప్రధాని బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతులకు మేలు జరగాలనే ప్రధాని మోడీ ఈ చట్టాలు తీసుకొచ్చారని, పంట అమ్ముకుంటే రైతులకు లాభం రావాలి కానీ బ్రోకర్లకు కాదన్నారు. అందుకే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. అన్నదాతలు బ్రోకర్ల మాట నమ్మారని, నిరసనల వెనక బ్రోకర్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధులు వారే ఇచ్చారు. సారా ప్యాకెట్స్ ఇచ్చిన అంశాలను మనం చూశామన్నారు. వీళ్ల వెనక ఉన్న వారు దేశవాతావరణం పాడుచేస్తున్నారని ప్రధాని మోడీ గమనించారని వెల్లడించారు. అందుకే రైతు చట్టాలు రద్దు చేశారన్నారు.