- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బ్రాడ్‌బ్యాండ్ వేగాన్ని అప్‌గ్రేడ్ చేయాలి’
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ప్రస్తుతం ఉన్న బ్రాడ్‌బ్యాండ్ నిర్వచనం, ఇంటర్నెట్ వేగానికి కాలం చెల్లిందని, దీన్ని 512కేపీపీఎస్ నుంచి 2 ఎంబీపీఎస్‌కు అప్‌గ్రేడ్ చేయాలని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ (BIF) టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్‌ను కోరింది. గత కొన్నెళ్లలో కమ్యూనికేషన్ టెక్నాలజీ పూర్తిగా మారిందని, డేటా సేవలకు కొత్త మార్కెట్లు పుట్టుకొచ్చాయని బీఐఎఫ్ పేర్కొంది. సరికొత్త ఇంటర్‌నెట్ అప్లికేషన్లు, వినియోగం కోసం ఇప్పుడున్న దానికంటే ఎక్కువ వేగవంతంగా ఇంటర్‌నెట్ అందించాల్సి ఉందని వెల్లడించింది.
‘బ్రాడ్‌బ్యాండ్ ప్రస్తుత సాంకేతికత నేపథ్యంలో ఇంటర్‌నెట్ వినియోగదారులు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కోరుకుంటున్నారు. కాబట్టి దీన్ని సమీక్షించి పునర్నిర్వచించాలని బీఐఎఫ్ పేర్కొంది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని ప్రోత్సహించేందుకు, మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ వేగాన్ని ప్రోత్సహించేందుకు ట్రాయ్ కోరిన సందర్భంగా బీఐఎఫ్ ఇంటర్‌నెట్ వేగాన్ని పెంచే ప్రతిపాదనను ఉంచింది. భారత్‌లో ఇప్పుడు 4జీ వచ్చేసినప్పటికీ, దేశీయంగా బ్రాడ్‌బ్యాండ్ వేగం 512 కేబీపీఎస్ ఉండటం సరైంది కాదు. ఇది, ప్రపంచ సగటు కంటే తక్కువ. దీన్ని 2 ఎంబీపీఎస్‌కు అప్‌గ్రేడ్ చేయడం అవసరమని బీఐఎఫ్ అధ్యక్షుడు టీ వి రామచంద్రన్ చెప్పారు.