అవమానంతో రెండు వారాలుగా ఏడుస్తున్నా: బ్రిట్నీ స్పియర్స్

by Shyam |
Britney Spears
X

దిశ, సినిమా : సింగర్ బ్రిట్నీ స్పియర్స్.. తన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఫ్రేమింగ్ బ్రిట్నీ స్పియర్స్‌’ డాక్యుమెంటరీపై ఫస్ట్ టైమ్ డైరెక్ట్‌గా స్పందించింది. పర్‌ఫార్మర్‌గా తన జీవితం, మానసిక ఆరోగ్య సమస్యలు, మీడియా తనపట్ల చూపించిన వైఖరి, 13 ఏళ్లుగా తన జీవితం, ఆర్థిక పరిస్థితిపై వివరించిన డాక్యుమెంటరీపై ఇన్‌స్ట్రాగామ్ ఎకౌంట్‌లో ఒపీనియన్ షేర్ చేసింది. ‘నా జీవితం ఎప్పుడూ ఊహాగానంగా మిగిలిపోతోంది. అందరూ తనను చూస్తూ, జడ్జ్ చేయడంలోనే లైఫ్ గడిచిపోతోంది. అందుకే నేను మనిషినే, సజీవంగా ఉన్నాననే అనుభూతి చెందేందుకు ప్రతీ రోజు రాత్రి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. ప్రజల ముందు పర్‌ఫార్మ్ చేసేందుకే నా జీవితం మొత్తాన్ని ధారపోశాను. ఈ ప్రపంచాన్ని నమ్మేందుకు చాలా బలం కావాలి. ఈ క్రమంలో చాలాసార్లు అవమానించబడ్డాను.. మీడియాతో ఇబ్బందిపడ్డాను.. ఇప్పటికీ పడుతూనే ఉన్నాను. రోజులు గడుస్తున్నప్పుడు, జీవితం కొనసాగుతున్నప్పుడు మనుషులం ఇంకా సున్నితంగా ఉండాల్సి వస్తుంది’ అని తెలిపింది.

అయితే తనపై వచ్చిన డాక్యుమెంటరీని ఇంకా చూడలేదన్న బ్రిట్నీ స్పియర్స్.. కానీ మేకర్స్ తనపై చూపిన అటెన్షన్‌తో చాలా ఇబ్బందిపడ్డానని తెలిపింది. రెండు వారాల పాటు ఏడ్చానని, ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నానని చెప్పింది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా తన సొంత ఆనందాన్ని, ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తున్నానని.. ఇందులో భాగంగానే ప్రతీ రోజు డ్యాన్స్ చేస్తున్నానని తెలిపింది. తాను పర్‌ఫెక్ట్‌గా ఉండడానికి ఇక్కడ లేనని, పర్‌ఫెక్షన్ అనేది బోర్ కొడుతుందని తెలిపింది బ్రిట్నీ స్పియర్స్.

Advertisement

Next Story