- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ హీరోయిన్‌కు సారీ చెప్పిన బ్రిటిష్ ఎయిర్‌వేస్
దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కొటక్‌కు బ్రిటిష్ ఎయిర్‌వేస్ సారీ చెప్పింది. ఇప్పటి వరకు తనకు రీఫండ్ అందకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. తను విదేశాలకు వెళ్లే క్రమంలో మే 2020లో ఫ్లైట్ క్యాన్సల్ కాగా, ఇప్పటి వరకు కూడా రీఫండ్ ప్రాసెస్‌ను వేగవంతం చేయకపోవడం తమకే ఆశ్చర్యంగా ఉందని చెప్పింది యాజమాన్యం. దీనిపై మీకు అప్‌డేట్ ఇవ్వకపోవడం పట్ల మన్నించాలని.. ఇందుకు సమయం కేటాయించకపోవడంపై చింతిస్తున్నామని తెలిపింది. కాగా ఈ మెసేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన కరిష్మా కొటక్.. దీనిపై స్పందించినందుకు థాంక్స్ చెప్పింది.
@British_Airways wow thanks for this pic.twitter.com/i38NEEHYLn
— karishma kotak.. (@karishmakotak) February 7, 2021
తెలుగులో ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న కరిష్మా కొటక్.. ప్రస్తుతం లండన్‌లో సెటిల్ అయిపోయింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్.. కొంతకాలం ఐపీఎల్ హోస్ట్‌గా, టీవీ ప్రజెంటర్‌గా రాణించింది. అంతేకాదు హిందీ బిగ్ బాస్ సీజన్ 6లోనూ పార్టిసిపేట్ చేసింది భామ.