- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రిటన్ మై‘గ్రేట్’ పాలసీ
తమ దేశంలోకి ఉద్యోగాల కోసం వచ్చే వలసదారులను నియంత్రించడానికి బ్రిటన్ ప్రభుత్వం కొత్త వలస విధానాన్ని రూపొందించింది. జనవరి 1, 2021 నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన తర్వాత ఈ విధానం అమల్లోకి రానుంది. పాయింట్ల విధానంగా ప్రచారమవుతున్న ఈ కొత్త వలస విధానం గురించిన పూర్తి వివరాలు మీకోసం..
ఈ విధానంలో ఈయూ, ఈయూయేతర వలసదారులను ఒకే పద్ధతి ద్వారా అనుమతించబోతున్నారు. ఎంతమందిని రానివ్వాలనే విషయం మీద ఇందులో ఎలాంటి నిబంధన లేదు. కనీసం 25,600 పౌండ్ల జీతం ఉన్నవారినే అనుమతించాలని నిబంధన ఉన్నప్పటికీ అంతకంటే తక్కువ ఉండి, ఆయా రంగాల్లో ఉత్తమ నైపుణ్యం ఉండి, ఆ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు తక్కువ ఉన్నట్లయితే అనుమతించవచ్చు.
అలాగే వీసా పొందాలంటే ఆమోదిత కంపెనీ నుంచి ఉద్యోగం ఉండాలి, ఆంగ్లం వచ్చి ఉండాలి. అంతేకాకుండా చదువు, జీతం, సంబంధిత రంగంలో ఉద్యోగుల కొరతను బట్టి పాయింట్లు పొందాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత 70 పాయింట్లు వచ్చిన వారికి ప్రవేశం అనుమతివ్వనున్నారు. ఆమోదిత కంపెనీ నుంచి ఉద్యోగం ఉంటే 20 పాయింట్లు, ఉద్యోగానికి తగ్గ నైపుణ్యాలకు 20 పాయింట్లు, ఆంగ్లం మాట్లాడగలిగితే 10 పాయింట్లు తప్పనిసరిగా పొంది ఉండాలి.