జపాన్ రికార్డు బ్రిటన్‌కి పాయె!

by Shamantha N |
జపాన్ రికార్డు బ్రిటన్‌కి పాయె!
X

మొన్నటికి మొన్న ప్రపంచానికి పెద్ద తాతయ్య ఇకలేరు అంటూ మన దిశ వెబ్‌సైట్లో వార్త వచ్చింది కదా.. ఆ చనిపోయిన తాతయ్య చిటెట్సు వతనబీ కారణంగా జపాన్ రికార్డు కాస్త బ్రిటన్‌కి పోయింది. అర్థం కాలేదా? అయితే ఈ వార్త కూడా చదవండి.

ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడిగా మొన్నటి వరకు చిటెట్సు వతనబీ పేరు మీద ఉన్న రికార్డు ఇప్పుడు బ్రిటన్‌కి చెందిన బాబ్ వెయిటన్‌‌కి దక్కింది. 112 ఏళ్ల చిటెట్సు చనిపోయాక ఆ టైటిల్‌ను 111 ఏళ్ల బాబ్ దక్కించుకోబోతున్నారు. ఇంకా చెప్పాలంటే వచ్చే నెలలో బాబ్ కూడా 112 ఏళ్లకు చేరుకోబోతున్నారు. అయితే చిటెట్సు చనిపోయిన విషయాన్ని తాను సెలబ్రేట్ చేసుకోవడం ఏ మాత్రం సబబుగా అనిపించడంలేదని బాబ్ అంటున్నారు.

హాంప్‌షైర్ లోని ఆల్టన్‌లో నివాసముంటున్న బాబ్, మార్చి 29, 1908న జన్మించారు. రెండు ప్రపంచ యుద్ధాలను, సోవియట్ యూనియన్ గెలుపోటములను, ఇంటర్నెట్ ఆగమనాన్ని ఆయన చూశారు. ఒకరి చావు వల్ల వచ్చిన రికార్డు తనకు పెద్దగా సంతృప్తిని ఇవ్వడం లేదని అంటున్నాడు. కానీ తన కుటుంబ సభ్యులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారని బాబ్ చెబుతున్నాడు. బాబ్‌కి ముగ్గురు పిల్లలు, 10 మంది మనుమలుమనమరాళ్లు, 25 మంది మునిమనుమలుమనమరాండ్లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed