- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ లేకుంటే రోడ్లు ఊడవాల్సిందే..
దిశ, వెబ్ డెస్క్: బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లు ధరించకుండా బయట తిరుగుతూ, జరిమానాలను చెల్లించేందుకు నిరాకరిస్తున్న వారితో రోడ్లు ఊడిపించాలని కార్పొరేషన్ నిర్ణయించింది. నిబంధనలను ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు ఇప్పటికే నిఘా విభాగాలను కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఈ విభాగాలు దృష్టి సారించాయని కార్పొరేషన్ తెలిపింది. మాస్క్‌ల నిబంధనను ఉల్లంఘించిన వారి నుంచి గత 212 రోజుల్లో 3 కోట్ల 49 లక్షల రూపాయలను వసూలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. కొందరు మాస్క్ లు ధరించకుండా, జరిమానాలు కట్టేందుకు నిరాకరిస్తున్నానని కార్పొరేషన్ తెలిపింది. స్థోమత లేక మరి కొందరు జరిమానాలు కట్టలేకపోతున్నారని చెప్పింది. అయితే ప్రభుత్వాలు పలుమార్లు హెచ్చరించినా ప్రజలు మాస్క్ లు లేకుండా బహిరంగంగా సంచరిస్తున్నారని తెలిపింది. దీంతో ఇబ్బందిగా మారుతోందని కార్పొరేషన్ చెబుతోంది.
అయితే మాస్క్ లు ధరించకుండా పట్టుబడినప్పుడు కొందరు క్షమాపణలు చెబుతున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో వారికి స్వచ్చందంగా కమ్యూనిటీ పనులు అప్పజెపుతున్నామని అధికారులు తెలిపారు. కాగా మరికొందరు అధికారులనే బెదిరిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్టు అధికారులు చెప్పారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలంటూ నిఘా విభాగాలకు బీఎంసీ ఆదేశాలు జారీ చేసింది.