40 వేల తమిళ బ్రాహ్మణులకు పిల్ల దొరకట్లే.. అందుకే అక్కడ వెతుకులాట!

by Shyam |
40 వేల తమిళ బ్రాహ్మణులకు పిల్ల దొరకట్లే.. అందుకే అక్కడ వెతుకులాట!
X

దిశ, ఫీచర్స్ : 40 వేల పురుషులు.. వయసు 30-40.. తమిళనాడు బ్రాహ్మణులు.. వధువు కోసం వెతుకులాట. ఈ మాత్రానికి ఆశ్చర్యపోతే.. అది కూడా యూపీ, బిహార్‌‌కు చెందిన అమ్మాయిల కోసం వెతుకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళ బ్రాహ్మణ కమ్యూనిటీలో 10 మంది అబ్బాయిలకు కేవలం ఆరుగురు అమ్మాయిలే ఉంటుండగా మరో నలుగురికి మ్యాచ్ సెట్ చేసేందుకు అయ్యంగార్లు ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సిన స్థితి ఏర్పడింది.

ఈ విషయంపై మాట్లాడిన తమిళనాడు బ్రాహ్మణ్ అసోసియేషన్(తంబ్రాస్) ప్రెసిడెంట్ ఎన్ నారాయణ్.. ‘మా సంఘం తరపున స్పెషల్ మూమెంట్ లాంచ్ చేశాం’ అని తెలిపాడు. ఈ అసోసియేషన్‌కు సంబంధించిన మంథ్లీ తమిళ్ మ్యాగజైన్ నవంబర్ ఇష్యూలో ఇందుకు సంబంధించిన ఓపెన్ లెటర్ కూడా పబ్లిష్ చేశారు. అంతేకాదు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ, లక్నో, పాట్నా తదితర ప్రాంతాల్లో కో ఆర్డినేటర్స్‌ను నియమించినట్లు వెల్లడించారు. హిందీ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే తమ హెడ్ క్వార్టర్స్‌లో కో ఆర్డినేట్ రోల్ ప్లే చేసేందుకు అర్హులని ప్రకటించారు. ఈ మూమెంట్‌పై ప్రశంసలు అందుతుండగా.. విమర్శకులూ లేకపోలేదు.

కాగా ఈ విషయంపై స్పందించిన ఎడ్యుకేషనిస్ట్ ఎం. పరమేశ్వరన్.. తమిళ బ్రాహ్మణ అబ్బాయిలకు వధువు దొరక్కపోవడానికి అసలు కారణం ఇది మాత్రమే కాదని అభిప్రాయపడ్డాడు. ఈ కమ్యూనిటీకి చెందిన వరుడి కుటుంబం.. పెళ్లి ఖర్చునంతా అమ్మాయి కుటుంబంపైనే వేస్తుందని, ఆకాశాన్నంటేలా వివాహ సంబరాలు జరగాలని డిమాండ్ చేస్తారని వివరించాడు. అలాంటప్పుడు సింపుల్ మ్యారేజ్‌లను ప్రోత్సహించాల్సిన బాధ్యత తంబ్రాస్ సంఘానిది కాదా? అని ప్రశ్నించారు.

ఇక తమిళ్, తెలుగు బ్రాహ్మణుల పెళ్లి.. కన్నడ మాట్లాడే మాధ్వాస్, తమిళ్ మాట్లాడే స్మార్థాస్‌తో జరగడం అనేది గతంలో కనీసం ఊహించను కూడా లేదని, కానీ ఇప్పుడిది నార్మలైజ్ కావడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఇక అయ్యంగార్ కమ్యూనిటీలోని తెన్‌కలై, వడకలై సెక్షన్ల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండేవి కాదని, ఇప్పుడు ఇలాంటి స్థితి రావడం నిజంగా సంతోషకరమని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed