- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్ మ్యారేజ్.. 6 నెలలకే వివాహిత మృతి
దిశ, వెబ్డెస్క్ : వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పిల్లల మీద పెంచుకున్న అమితమైన ప్రేమ తల్లిదండ్రులను ఆ వివాహాన్ని అంగీకరించేలా చేసింది. ఆరునెలల వరకు సాఫీగా సాగిన నవ దంపతుల జీవితంలో ఒక్క సారిగా కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో బుధవారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. దీపిక, సాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఆరు నెలల కాలంలోనే దీపిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం దీపిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
కట్నం కోసం తన కూతురుని అత్తింటి వారే చంపేశారని.. గత రాత్రి కట్నం కోసం తనను వేధిస్తున్నారని దీపిక ఫోన్ చేసిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. బాధిత కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.