ఆయన వద్దు.. ఈయనే ముద్దు

by Anukaran |
ఆయన వద్దు.. ఈయనే ముద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: రీల్ సీన్ తలపించే రియల్ సీన్ ఇది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోతే మొండికేసి వెళ్లిపోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇది మహబూబాబాద్ లో రియల్ గా జరిగింది. అవును..! ఇది నిజం. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండాలనికి చెందిన రాజేష్ కు.., కురివి మండలం కాంపెల్లికి చెందిన దివ్యతో పెళ్లి ఫిక్స్ అయ్యింది. వేదికపై వధూవరులు కూర్చున్నారు. ముహూర్తం టైం సమీపించింది. పురోహితులు గౌరీపూజ చేస్తున్న సమయంలో.., వధువు దివ్య తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ పోలీసులకు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వధువును స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఈ కౌన్సిలింగ్ లో వధువు తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదని, తాను కాంపెల్లికి చెందిన యువకున్ని ప్రేమించానని.. అతడినే వివాహం చేసుకుంటానని చెప్పింది. వరుడు రాజేష్ కు అదే మండపంలో ఉన్న మరో యువతితో వివాహం జరిపించారు.

సీన్ కట్ చేస్తే వధువు దివ్య మహబూబాబాద్‌ మండలం అనంతారం జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో ప్రియుడు నరేశ్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రేమ పెళ్లి మరిపెడ మండలంలో హాట్ టాపిగ్గా మారింది.

Advertisement

Next Story