- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్‌పై సీతక్క ఫైర్.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్..
దిశ, ములుగు: కాంగ్రెస్ పార్టీ బుధవారం ములుగు జిల్లా కేంద్రములో భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యములో రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 70వేల పుస్తకాలు చదివిన వ్యక్తికి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త రాజ్యాంగాన్ని రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు స్పందించాలని, రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ప్రజలపై, వ్యవస్థలపై దేనిపై విశ్వాసం లేదన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎం కేసీఆర్‌పై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ రచించిన మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తే.. మీరు ఆ రాజ్యాంగాన్ని మార్చాలి అంటారా అని మండిపడింది. ఈ విషయంపై ప్రశ్నిస్తే బలహీన వర్గాలను కుక్కలు, నక్కలు అంటారా అని విరుచుకుపడింది. ఇన్ని రోజులు బీజేపీ ఒక్కటే రాజ్యాంగాన్ని మార్చాలని కలలు కన్నది.. ఇప్పుడు దానికి ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ కూడా తోడైందని విమర్శించింది. కేసీఆర్ తక్షణమే ఆ మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సభ్యత్వ నమోదు ఇంచార్జీ రవళి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, జెడ్పీటీసీ నామ కరం చంద్ గాంధీ, మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ, ఎండీ చాంద్ పాషా, ఎండీ అప్సరు పాషా, సహకార సంఘం చైర్మన్ పన్నాలా ఎల్ల రెడ్డి,ములుగు సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.