BREAKING : అక్రమంగా దక్కే అధికారాన్ని నేను స్వీకరించను : పాల సముద్రం సభలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
BREAKING : అక్రమంగా దక్కే అధికారాన్ని నేను స్వీకరించను : పాల సముద్రం సభలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో రూ.541 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ(నాసిన్‌)ను ప్రధాని మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, సీఎం జగన్‌, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 503 ఎకరాల్లో రూపుదిద్దుకున్న నాసిన్ క్యాంపస్‌లో 3 లక్షల మొక్కలు, 300 ఎకరాల్లో బయోడైవర్సిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 300 రకాల వృక్ష జాతులు 30 రకాల థమ్స్‌తో క్యాంపస్‌ను రూపొందించారు. ఈ క్యాంపస్ 180 ఎకరాల్లో విస్తరించిన పాలసముద్రం లేక్ పక్కనే ఉండటం విశేషం.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. నాసిన్ అకాడమీ ఏపీకి రావడం గర్వ కారణమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత వాణిజ్య విధానానికి మంచి పేరు ఉందని అన్నారు. ఈజ్ డూయింగ్‌కి నాసిన్ లాంటి సంస్థలతో చాలా ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ధర్మానికి, నిష్పక్షపాత విధానాలకు రాముడే ప్రత్యక్ష నిదర్శనమని, ఆయన పాలన ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రభుత్వాల్లో పని చేసే అధికారులంతా శ్రీరాముడిని ప్రేరణగా తీసుకుని పని చేయాలన్నారు. అక్రమంగా దక్కే అధికారాన్ని స్వీకరించొద్దని రాముడు చెప్పాడని ఆయన అన్నారు. అక్రమంగా దక్కే అధికారాన్ని తాను కూడా స్వీకరించబోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశమంతా రామమయం అయిపోయిందని అన్నారు. పారిపాలనా దక్షతకు రాముడి మారుపేరని పేర్కొన్నారు.

Advertisement

Next Story