- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తరాఖండ్ ఫలితాల్లో విచిత్రం.. బీజేపీ గెలిచినా.. సీఎం అభ్యర్థి డౌటే!
దిశ, డైనమిక్ బ్యూరో : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. గోవాలోనూ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో బీజేపీ ఉంది. ఈ క్రమంలో మరో ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులను పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. దీంతో మొత్తం 4 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందే అవకాశం ఉన్నప్పటికీ.. పార్టీకి ఘోర ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. వివరాళ్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ బీజేపీ సీఎం అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్రంలో బీజేపీ పార్టీని గెలుపొందించేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ, ఆయనే గెలుపొందలేకపోతున్నారు. ఏకంగా ప్రత్యర్థిపై ధామి 6వేల ఓట్ల వెనుకంజలో ఉండటంతో రాష్ట్రంలోని బీజేపీ క్యాడర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. దీంతో కార్యకర్తలకు ధామి ఓటమి భయం ముందు బీజేపీ గెలుస్తుందన్న సంతోషం కూడా చిన్నదైపోయింది.