- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాగ్ జట్టులో ధోనికి స్థానం లేదు
దిశ, స్పోర్ట్స్: గత 15 ఏండ్లుగా భారత క్రికెట్ జట్టు ఎన్నో అద్వితీయమైన విజయాలను సొంతం చేసుకుంది. సొంత గడ్డపై తప్ప విదేశాల్లో కాగితం పులులే అనే మాటను చెడిపేస్తూ టెస్టులు, వన్డేల్లో నెంబర్ వన్ జట్టుగా ఎదిగింది. ఈ కాలంలోనే టీ20, వన్డే వరల్డ్ కప్‌లను తమ ఖాతాలో వేసుకొని తిరుగులేని జట్టుగా నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లో ఈతరం క్రికెటర్లు ఎన్నో రికార్డులు తిరగరాశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ప్రపంచ అత్యుత్తమ జట్లను ప్రకటించాడు. ఈ జట్టులో ఐదుగురు భారతీయ క్రికెటర్లే ఉండటం విశేషం. వీరితోపాటు ఆసీస్, ఇంగ్లండ్ నుంచి చెరో ఇద్దరు, పాకిస్తాన్, న్యూజిలాండ్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేశాడు. అయితే, ఈ జట్టులో విజయవంతమైన కెప్టెన్ ధోనీ లేకపోవడం గమనార్హం.
ఇదే బ్రాడ్ హాగ్ జట్టు
రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లి(కెప్టెన్), బాబర్ ఆజమ్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కీపర్), రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, లూకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యజువేంద్ర చాహల్.