ఆమెకు 12.. అతడికి 19.. రాత్రి వాటర్ ట్యాంక్ మీదకు బాలికను తీసుకెళ్లి..

by Anukaran |   ( Updated:2021-11-04 05:33:15.0  )
ఆమెకు 12.. అతడికి 19.. రాత్రి వాటర్ ట్యాంక్ మీదకు బాలికను తీసుకెళ్లి..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజెంట్ జనరేషన్ ప్రేమ పేరుతో అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రేమిస్తున్నానంటూ వెంటబడి తీరా.. ప్రేమించాక బ్రేకప్ అంటూ తమ రిలేషన్‌‌ను కట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య గొడవలు, వాగ్వాదాలు చోటుచేసుకొని హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 19 ఏళ్లున్న ఓ యువకుడు మైనర్‌(12)ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి చివరకు ఆమెను దారుణంగా హత్య చేశాడు.

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన విక్రమ్‌(19) స్థానికంగా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. అతడికి ఓ 12 ఏళ్ల బాలిక కనిపించడంతో ఆమెను ఇష్టపడ్డాడు. దీంతో ఆమెను ప్రతీరోజు ఫాలో చేసి ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. తెలిసీ తెలియని వయసులో ఆ అమ్మాయి కూడా విక్రమ్‌ను ఇష్టపడుతున్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఆకాశమే హద్దుగా వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమ పేరుతో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇప్పటివరకు బాగానే ఉన్నా కొద్ది రోజులు క్రితమే వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ప్రతీ చిన్న విషయానికి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటం విక్రమ్‌కు నచ్చలేదు. దీంతో బాగా ఆలోచించన విక్రమ్.. ఆమెను అడ్డుతప్పించుకోవాలనుకున్నాడు. దీని కోసం పక్కా ప్లాన్ చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆమెను నవంబర్ 1న మారుమూల ప్రదేశంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్దకు రమ్మన్నాడు. అక్కడ కాసేపు మాట్లాడుకున్నాక వారిద్దరూ ఆమెను వాటర్ ట్యాంక్ మీదకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే విక్రమ్ దారుణానికి పాల్పడ్డాడు. బండరాయితో బాలికపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం బాలికను వాటర్ ట్యాంక్ పై నుంచి కిందకు తోసేశాడు. తర్వాత ఏమీ తెలియనట్టుగా కిందకి దిగి వెళ్లిపోయాడు. శవాన్ని చూసిన వారంతా ఆ బాలికే ట్యాంక్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని అనుకున్నారు.

ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా విక్రమ్ లీలలు బయటకు వచ్చాయి. విచారణలో భాగంగా ఆమెను విక్రమే హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ మర్డర్ నుంచి తప్పించుకోవడం ఎలా అని.. నిందితుడు విక్రమ్ తన ఫోన్‌లో సెర్చ్ చేసిన లింక్‌లను కూడా పోలీసులు గుర్తించారు. దీంతో బాలికను విక్రమే హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

సమంత షాకింగ్ డెసిషన్.. ఇక వాటికి గుడ్ బై చెప్పనుందా ?

Eesha Rebba : నడుమందాలతో కవ్విస్తోన్న భామ

Anchor Sreemukhi : పొట్టి స్కర్టులో పిచ్చెక్కించిన యాంకర్ శ్రీముఖి.. వావ్ అనాల్సిందే.

Advertisement

Next Story