- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి ఎదుటే స్నేహితుల గ్యాంగ్ రేప్.. ప్రియురాలి పెళ్లి గిఫ్ట్ గా వీడియోని వైరల్ చేసి..
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ అంటే ఏంటి..? ప్రేమించిన అమ్మాయి తనతో లేకపోయినా ఆమె జ్ఞాపకాల్లోనే ఉండడం ప్రేమ.. ప్రేమించిన అమ్మాయి వేరేవాడిని పెళ్లిచేసుకున్నా.. ఆమె సంతోషాన్ని కోరుకొనేవాడు ప్రేమికుడు. కానీ, ఈ కాలంలో అలాంటి ప్రేమ, ప్రేమికుడు ఎవరు లేరు. ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో అమ్మాయిలను లైంగికంగా వేధించడం, వారు వేరొకరిని పెళ్లిచేసుకొంటే అమ్మాయిని చంపేయడం, లేదా వారి పర్సనల్ వీడియోలను బయటపెట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఒక ప్రియుడు తన ప్రియురాలు వేరొకరిని పెళ్లి చేసుకొంటుందని ఆమెపై జరిగిన గ్యాంగ్ రేప్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆమె పెళ్లిని ఆపేశాను అనుకొంటూ ఆ యువతి జీవితాన్ని నాశనం చేసిన ఘటన బీహార్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని గోపాల్ గంజ్ సమీపంలోని కాటేయా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువతి(20) అదే ప్రాంతానికి చెందిన అభిషేక్(20) ప్రేమించుకున్నారు. ఫ్రీ టైం దొరికినప్పుడు కలిసి ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్లేవారు. అలా ఒకసారి వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో యువకుడి స్నేహితులు నలుగురు వచ్చి అభిషేక్ ను పక్కకు లాగేసి ప్రియురాలిని గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఆ ఘటనను వీడియో తీశారు. ఏదో విధంగా ఆరోజు గ్యాంగ్ రేప్ నిందితుల నుంచి ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. అది జరిగి రెండేళ్లు అవుతుంది. ఈ సమయంలో నువ్వు గ్యాంగ్ రేప్ జరిగిందని కేసు పెడితే మనం కూడా చిక్కుల్లో పడతామని కేసు పెట్టకుండా సైలెంట్ గా ఉంటే మంచిది అని ప్రియుడు ప్రియురాలికి మాయమాటలు చెప్పడంతో ఆ అమ్మాయి సైలెంట్ గా ఉండిపోయింది. అలా ఏళ్లు గడిచాయి.
ఇటీవల యువతికి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆ పెళ్లికి ప్రియుడు నిరాకరించాడు. తానే పెళ్లి చేసుకొంటానని చెప్పాడు. కానీ, యువతి మాత్రం “ఆరోజు నీ స్నేహితులు నన్ను రేప్ చేస్తుంటే పట్టించుకోలేదు.. అలాంటివాడిని నేను పెళ్లిచేసుకోను” అని చెప్పడంతో ప్రియుడు ఆగ్రహానికి గురయ్యాడు. ఎలాగైనా ప్రియురాలి పెళ్లిని ఆపాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన స్నేహితుల వద్ద ఉన్న ఆమె గ్యాంగ్ రేప్ వీడియోను తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో పెళ్లి కొడుకు పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. కన్నకూతురు రేప్ వీడియోను చూసిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఇక ఈ ఘటనపై బాధితురాలు కేసు పెట్టడంతో ఐదు మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఆమె మాజీ ప్రేమికుడు పరారీలో ఉన్నాడని, నిందితుల్లోని ఇద్దరూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని భారత్ రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు బీహార్ లో సంచలనం సృష్టిస్తోంది.