ప్రేమోన్మాది ఘాతుకం.. దానికి ఒప్పుకోలేదని నడిరోడ్డుపై ప్రియురాలిని..

by Anukaran |   ( Updated:2021-08-30 22:26:04.0  )
ప్రేమోన్మాది ఘాతుకం.. దానికి ఒప్పుకోలేదని నడిరోడ్డుపై ప్రియురాలిని..
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. గుంటూరులో నడిరోడ్డుపై రమ్య అనే యువతిని దారుణంగా కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది ఘటన మరువకముందే.. కర్ణాటకలో మరో ప్రేమోన్మాది అరాచకం సృష్టించాడు. ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోలేదని నడిరోడ్డుపైనే గొంతుకోసి హత్య చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే.. దొడ్డబెలె గ్రామానికి చెందిన అనిత (23) అనే యువతి ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న సహొద్యోగి వెంకటేశ్‌(25) ఆమెను మూడేళ్ళుగా ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా తన ఇంట్లో ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వెంకటేశ్, అనిత వాళ్లింట్లో పెళ్లి గురించి మాట్లాడాడు. కానీ, అనిత కుటుంబీకులు వారి పెళ్లికి తిరస్కరించి వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. అనిత కూడా ఇంట్లో ఒప్పుకోలేదు కాబట్టి తన వెనక తిరగవద్దని చెప్పడంతో వెంకటేశ్‌ పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం అనిత ఆఫీస్ కి వెళ్తుండగా బైక్ పై వచ్చిన వెంకటేశ్ ఆమెను అడ్డగించి అందరూ చూస్తుండగానే కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అనిత సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇటీవలే వెంకటేశ్ మార్కెట్ లో రూ. 80 తో కత్తి కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

Advertisement

Next Story