ప్రియుడి అంగాన్ని కోసిన ప్రియురాలు.. దాంతో ఏం చేసిందంటే..?

by Anukaran |   ( Updated:2021-04-05 06:21:40.0  )
ప్రియుడి అంగాన్ని కోసిన ప్రియురాలు.. దాంతో ఏం చేసిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: వారిద్దరూ ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేన్నంతగా ప్రేమించుకున్నారు. అందుకనే ఇద్దరు కలిసి ఉండాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా సహజీవనం మొదలుపెట్టారు. ఇలా వారి జీవితం కలల ప్రపంచంలా మారిపోయింది. అయితే ఈ సంతోషం ఆమెకు ఎక్కువ సేపు నిలువలేదు. కొద్దీకొద్దిగా తనపై ప్రియుడి ప్రేమ తగ్గడం మొదలయిందని గ్రహించింది. ఎందుకు తనను దూరం పెడుతున్నాడా అర్థంకాని ఆ ప్రియురాలు ప్రియుడ్ని వెంబడించింది. తాను కాకుండా ప్రియుడు వేరొక అమ్మాయి మోజులో పడ్డాడని తెలుసుకుంది. అంతే.. ఆమె కోపం ఉద్రేకంగా మారిపోయింది.

తనకు దక్కనివాడు వేరే ఎవరికి దక్కకూడదనుకొని ఒక హాంకాంగ్ యువతి దారుణానానికి ఒడిగట్టింది. ప్రేమించిన వాడు మోసం చేసాడని ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. ప్రియుడు మద్యం మత్తులో ఉన్నప్పుడు అతని మర్మాంగాన్ని కత్తెరతో కోసేసింది. మళ్లీ వైద్యులు అతికించడానికి వీలు ఉండకూడదని ఆ భాగాన్ని బాత్ రూమ్‌లో వేసి ఫ్లష్ చేసింది. ఈ దారుణ ఘటన తర్వాత తానే స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోయింది. బాధితుడిని స్థానికులు ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed