పాము కాటుతో బాలుడు మృతి…

by Shyam |   ( Updated:2020-09-01 11:28:45.0  )
పాము కాటుతో బాలుడు మృతి…
X

దిశ, తుంగతుర్తి: సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో పదేండ్ల బాలుడు సోమవారం అర్ధరాత్రి పాము కాటుకు గురై మృతి చెందాడు. వివరాళ్లోకి వెళితే… తుంగతుర్తి మండల కేంద్రంలో నివసించే కొండ రాధిక, క్రిష్ణ దంపతుల కుమారుడు కొండ జ్ఞానేశ్వర్(10) సోమవారం ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి సమయంలో పాము కాటు వేసింది.

దీంతో వెంటనే తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆసుపత్రుల్లో ఆ సమయానికి డాక్టర్ లేకపోవడంతో, అక్కడనుంచి సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. దీంతో మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని తండ్రి కొండ కృష్ణ రెండేండ్ల క్రితం ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయాడు. తల్లి రాధిక కూలిపని చేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ, కుటుంబాన్ని పోషిస్తూ జీవిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed