మద్యం మత్తు.. పిల్లాడి జీవితం చిత్తు..!

by srinivas |
మద్యం మత్తు.. పిల్లాడి జీవితం చిత్తు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : మద్యం మనిషిని సోయి తప్పేలా చేస్తోంది. పీకల దాక తాగాక ఏం చేస్తున్నామో కూడా తెలియని స్టేజ్ లో కొందరు మందుబాబులు ఉండిపోతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపవొద్దని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు. అవగాహన కార్యక్రమాల పేరిట కోట్లు ఖర్చు చేసినా ప్రభుత్వాలు ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. దీంతో మందుబాబులు చేసే తప్పిదాలకు అమాయకులైన సామాన్యులు, అభంశుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది.

తండ్రికి సాయంగా పకోడి బండి వద్ద పనిచేస్తున్న పనిచేస్తున్న బాలుడిని మద్యం మత్తులో స్కార్పియో వాహనం నడపుతున్న ఓ వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి గాయాలతో బయటపడ్డాడు. అనంతరం యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అక్కడినుంచి తప్పించుకునేందుకు యత్నించగా గ్రామస్తులు వెంబడించి అతని వాహనాన్ని ధ్వంసం చేశారు. నిందితుడిని పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత తండ్రి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

మంచి నీటి నల్లా నుంచి మద్యం

Advertisement

Next Story