- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్: వడ్డీ మాఫీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్‌డెస్క్: పండుగ సీజన్ కోసం రుణ గ్రహీతలకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. మారటోరియం కాలంలో రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై వడ్డీ మీద వడ్డీని మాఫీ చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు వడ్డీ మీద వడ్డీ అంశంపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన తర్వాత కేంద్ర తాజా ఉత్తర్వులను ఇచ్చింది.
ఈ వడ్డీ మాఫీ వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 6500 కోట్ల వరకు భారం పడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. తాజా ఉత్తర్వుల ప్రకారం..6 నెలల కాలానికి రూ. 2 కోట్ల వరకు ఉన్న గృహ రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలు, వాహన రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలకు వడ్డీ మీద వడ్డీని మాఫీ చేసింది.
దీనికి సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు వడ్డీ నగదును కస్టమర్ల లోన్ అకౌంట్‌లలో జమ చేయనున్నాయి. ఆ తర్వాత కేంద్రం నుంచి సదరు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వసూలు చేసుకుంటాయి. సాధారణ వడ్డీకి, వడ్డీ మీద వడ్డీకి ఉన్న వ్యాత్యాసాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం తెలిపింది.