- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు కోర్టు షాక్
దిశ, సినిమా: బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో ఆడియన్స్ నుంచి ఎక్స్‌ట్రా మనీ కలెక్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించింది. సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ హైదరాబాద్ పంజాగుట్టలోని పీవీఆర్ సినిమాస్‌లో మూవీ చూసేందుకు బుక్ మై షో ద్వారా టికెట్ బుక్ చేసుకోగా, టికెట్ ధరపై అదనంగా 18 శాతం(టికెట్ ధర రూ.300 కాగా రూ.41 ఎక్స్‌ట్రా చార్జ్) వసూలు చేశారు. దీంతో ఆయన సెంట్రల్ కన్జ్యూమర్ ఎఫైర్స్ మినిస్ట్రీకి 2019 జనవరి 18న కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత జిల్లా వినియోగదారుల కమిషన్‌ను సైతం ఆశ్రయించారు. కేసు విచారించిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ 26 నెలల తర్వాత తీర్పు వెలువరించింది. టికెట్ ధరపై రూ. 6 అదనంగా వసూలు చేసుకోవచ్చని బుక్‌మై షో, పీవీఆర్‌కు సూచించిన వివాదాల పరిష్కార కమిషన్ విజయ్ గోపాల్‌కు రూ.25 వేల పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.1,000 చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అంతేకాదు లీగల్ పెయిడ్ కింద కోర్టుకు కూడా రూ.5,000 చెల్లించాలని, 45 రోజుల వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేయలేకపోతే 18 శాతం వడ్డీతో చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.