- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రంథాలయాలను తలపిస్తున్న ఫుట్‌పాత్‌లు
ఆ వీధులు విజ్ఞాన భాండాగారాలు.. వేలాది పుస్తకాలతో ఫుట్‌పాత్ లు గ్రంథాలయాలను తలపిస్తాయి. కథల పుస్తకాలు మొదలుకుని శాస్త్రసాంకేతిక పుస్తకాల వరకూ అన్నీ కనువిందు చేస్తాయి. తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ బుక్స్దొరుకుతాయి. అబిడ్స్, కోఠిలోని ప్రధాన రహదారులపై సండే వచ్చిందంటే చాలు వేలాది పుస్తకాలు దర్శనమిస్తాయి. వ్యాపారులు, పుస్తక ప్రియుల కొనుగోళ్లతో రహదారులు కిక్కిరిసిపోయి కనిపిస్తాయి. పెద్ద పెద్ద బుక్స్స్టోర్స్లలో లభించని పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. అందుకే సండే వచ్చిందంటే చాలు కావాల్సిన పుస్తకం కోసం కోఠి, అబిడ్స్వెళ్తుంటారు పుస్తక ప్రియులు.
దిశ ప్రతినిధి, హైదరాబాద్: విజ్ఞానాన్ని సముపార్జించేందుకు పుస్తక పఠనం తప్పనిసరి. విశాలమైన ప్రపంచంలో విభిన్న విషయాలపై సమగ్రమైన అధ్యయనానికి ఎన్నో దారులున్నాయి. వాటిలో అక్షరాలది ప్రత్యేక బాట. ‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్న కవి కాళోజీ మాటలను నిజం చేసే అక్షరాలతో వేలాది పుస్తకాలను పరచేది పుస్తకాల బాట. చరిత్ర, సాహిత్యం, సంగీతం, సైన్స్, టెక్నాలజీ, వైద్యం, ఇంజినీరింగ్ వంటి పుస్తకాలు చదవాలంటే గ్రంథాలయాలకు వెళ్లాలి. అక్కడికి వెళ్లినా అన్ని పుస్తకాలు ఉంటాయనే గ్యారంటీ లేదు. కానీ, నగరంలోని అబిడ్స్, కోఠి ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ పుస్తక మార్కెట్లలో తప్పకుండా లభ్యమవుతాయి. అబిడ్స్ లో ప్రతీ ఆదివారం ప్రధాన రోడ్డు పక్కనే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు విక్రయిస్తుంటారు . చిరు వ్యాపారుల విక్రయాలు, పుస్తక ప్రియుల కొనుగోళ్లతో అబిడ్స్ వీధులు కిక్కిరిసిపోతాయి. ప్రధాన పుస్తక విక్రయాల దుకాణాల్లో కూడా లభించని మహాభారతం, రామాయణం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి గ్రంథాలే కాకుండా అన్ని వయస్సుల వారికి విజ్ఞానాన్ని సముపార్జించి పెట్టే పుస్తకాలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషల్లో ఇక్కడ లభిస్తాయి. ఇవే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన రచయితల పుస్తకాలు, అన్ని తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు చౌక ధరలకే అందుబాటులో ఉంటాయి. షేక్ స్పియర్, కారల్ మార్క్స్, మహాత్మాగాంధీ, స్వామి వివేకానం ద, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ వం టి మహనీయుల రచనలు అబిడ్స్ సండే మార్కెట్ లో విక్రయిస్తుంటారు. అరుదైన పుస్తకాలు కూడా అబిడ్స్ వీధుల్లో ఆదివారం లభిస్తుండడంతో వీటి కోసం పుస్తక ప్రియులు గంటల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు. నచ్చిన పుస్తకాన్ని రూ.10 నుంచి రూ.100 వరకు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తారు.
చరిత్రకు సాక్ష్యాలు..
చరిత్రకు సాక్ష్యంగా నిలిచే కొన్ని అరుదైన పుస్తకాలు పెద్ద దుకాణాల్లో సైతం అందుబాటులో ఉండడం లేదు. ఇటువంటి పుస్తకాలు కూడా అబిడ్స్ సండే మార్కెట్‌లో ఫుట్ పాత్ పై లభిస్తాయి. అరుదైన పుస్తక సంపద లభిస్తుండడంతో అవసరం ఉన్న వారు దూరం ప్రాంతాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు.
పుస్తకాల మ్యూజియం..
అబిడ్స్ వీధుల్లో చిన్నారులకు బొమ్మల కథ లు, పెద్ద పిల్లలకు నీతికథలు, కళాశాల విద్యార్థులకు విజ్ఞాన శాస్ర్తాలు, పరిశోధకుల కోసం ప్రామాణిక గ్రంథాలు, పెద్దల కోసం పురాణాలు, సాహితీ అభిమానులకు కవిత్వం, కథలు, నవలలు, సాహితీ విమ ర్శ, సాహితీ చరిత్ర గ్రంథాలు లెక్కకు మించి లభిస్తా యి. పరిశోధకుల కోసం చరిత్ర, నిఘంటువులు, ఆడవారి అభిరుచులకు తగిన గృహాలంకరణ, వంటల పుస్తకాలు ప్రతీ ఆదివారం కొలువుదీరుతాయి. కోఠి, అబిడ్స్‌లో వారాంతంలో అందుబాటులో ఉండే పుస్తక విక్రేతలు ఖరీదైన పుస్తకాలను అతిచవకగా అమ్ముతూ పేదలకు విజ్ఞానాన్ని చేరువ చేస్తున్నారు. పుస్తక ప్రచురణ కర్త నిర్ధారించిన ధరకంటే అధిక ధరలోనూ కొన్ని అరుదైన పుస్తకాలు అమ్మకానికి ఉంచుతారు. పుస్తకాలు కొనేందుకు వచ్చిన వారు దొరికిందే భాగ్యం అనుకుంటూ బేరమాడకుండా కొంటుంటారు. అసంఖ్యాకమైన పుస్తకాలతో ఆదివారం ప్రదర్శనకు ఉంచే పుస్తకాలను చూ స్తూంటే నాడు ముత్యాలను రాశులుగా పోసిన నాటి భాగ్య నగరం గుర్తుకు వస్తుందని వయస్సు మీద పడిన వారు చెబుతుంటారు. ఇప్పుడు జ్ఞానాన్ని దాచుకున్న లక్షల అక్షరాల పుస్తక భాండాగారాన్ని ఇలా రాసులుగా పోసి ప్రతీ ఒక్కరిని, వయస్సుతో ప్రమేయం లేకుండా ఆధునికతలోకి నడిపిస్తోంది పాత పుస్తకాల వీధి.