సోషల్ మీడియాలో దాడి మొదలైంది

by srinivas |
సోషల్ మీడియాలో దాడి మొదలైంది
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుంచి నిష్క్రమించకూడదని టీడీపీ నేత బొండా ఉమ ఆకాంక్షించారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేయడంపై ఆయన స్పందిస్తూ,ముద్రగడపై వైఎస్ఆర్సీపీ వాళ్లే సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారని ఆరోపించారు. నాయకత్వం వహించే వారిపై విమర్శలు రావడం సహజమేనని అన్నారు.

కాపు రిజర్వేషన్ల గురించి సీఎం జగన్ కు ముద్రగడ లేఖ రాసిన తర్వాతే ఆయనపై సోషల్ మీడియాలో విమర్శల దాడి మొదలయిందని బొండా ఆరోపించారు. కాపులకు జగన్ తీరని అన్యాయం చేశారని అన్నారు.గత టీడీపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పించిందని… జగన్ సర్కారు ఆ రిజర్వేషన్లను రద్దు చేసిందని చెప్పారు. 13 జిల్లాల కాపు నాయకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ముందుకు రావాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed