నేను ఉన్నంత వరకు నువ్వు కూడా ఉండు.. బిపిన్ రావత్, సాయి తేజ మధ్య బంధం అదే..

by Anukaran |
నేను ఉన్నంత వరకు నువ్వు కూడా ఉండు.. బిపిన్ రావత్, సాయి తేజ మధ్య బంధం అదే..
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పొందిన 13 మంది సైనికుల గురించి ఒక్కో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది. ఇందులో ముఖ్యంగా చిత్తూరు జిల్లాకి చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ, సీడీఎస్ బిపిన్ రావత్‌ల మధ్య ఉన్న సంబంధం గురించి ఓ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

యాక్సిడెంట్‌పై సాయితేజ తండ్రి మోహన్ మాట్లాడుతూ.. ఆర్మీలోకి తన తమ్ముడిని కూడా సాయి తీసుకెళ్లాడు. ఎన్నో పదోన్నతులు తెచ్చుకున్నాడు. ఇక చాలు ప్రాణాలు మీదకు వచ్చే ఉద్యోగాన్ని వదిలేయాలని చెప్పినట్లు వెల్లడించారు. కానీ, ఎంత చెప్పినా.. రావత్‌తోనే ఉంటానంటూ సాయితేజ అన్నాడని తెలిపారు. అయితే.. సాయితేజ పారా కమాండోలకు శిక్షణ ఇవ్వడంలో ప్రతిభ కనబరిచి రావత్ వద్ద ఏడాది కింద వ్యక్తిగత భద్రత సిబ్బందిగా నియమితులయ్యారు. తల్లిదండ్రుల ఒత్తిడితో.. ఆర్మీ నుంచి వైదొలుగుతానని బిపిన్ రావత్‌కు సాయితేజ చెప్పడంతో.. తాను ఉన్నంత వరకూ నువ్వూ ఉండు సాయి అని రావత్‌ చెప్పారని.. వారిద్దరికీ ఎంతో అవినాభావ సంబంధం ఉండేదని మోహన్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story