- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా బోనాల పండుగ’
దిశ, రాజేంద్రనగర్ : తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా బోనాల పండుగ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ మధురానగర్ కాలనీలో బోనాల పండుగ ఉత్సవాలలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ తెల్లవారుజామునుంచే బోనాలు నెత్తిన పెట్టుకుని మహిళలు ఊరేగింపుగా వెళ్లి అమ్మ వార్లకు బోనాలు నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారని అన్నారు.
గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ నేపథ్యంలో బోనాల పండుగకు బంధువులు ఎవరు లేకుండానే కొవిడ్ ఇబ్బందుల మధ్య జరుపుకోవడం జరిగిందని, కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు బోనాల పండుగ ను ఘనంగా జరుపుకోవడం జరుగుతోందన్నారు. కరోనా వైరస్ ను పూర్తిగా రూపుమాపి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా అమ్మవారు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్, కౌన్సిలర్లు స్రవంతి శ్రీకాంత్ రెడ్డి, అజయ్, ప్రవీణ్ గౌడ్, బద్రునాయక్, నాయకులు గణేష్ గుప్త, ముద్దం మల్లారెడ్డి, ప్రసాద్,పవన్ కుమార్ గౌడ్, దేవేందర్ రెడ్డి, నరసింహ గౌడ్, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్, రాములు గౌడ్, సిద్దేశ్వర్ గౌడ్, తోట రాములు, శివానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.