- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నోరూరించే బొమ్మిడాయిల పులుసు
నాన్‌వెజ్ వంటలు వేటివవే రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఫిష్ కర్రీ, బొమ్మిడాయిల పులుసు టేస్టీగా ఉంటాయి. మరి నోరూరించే బొమ్మిడాయిల పులుసును ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
బొమ్మిడాయిలు -ఆర కేజీ
చింతపండు -కొద్దిగా (నీటిలో నానబెట్టుకోవాలి)
నూనె -3 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ -2
టమోటాలు -2
పచ్చిమిర్చి -4
మెంతులు – 2 టీ స్పూన్స్
అవాలు -1 టీస్పూన్
జీలకర్ర -1 టీస్పూన్
కారం -ఒక టేబుల్ స్పూన్
పసుపు -1 టీస్పూన్
ఉప్పు -రుచికి తగినంత
గరం మసాలా -2 టీస్పూన్స్ (కారం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మెంతులను కలిపి పొడి చేసుకోవాలి)
కరివేపాకు -2 రెమ్మలు
కొత్తిమీర -3 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం:
ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని సన్నని మంటపై వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం వేగాక ఇప్పుడు టమోటో ముక్కులను కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా వేగిన తర్వాత అందులో పసుపు, కారం, గరం మసాలా పొడి, ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని ఐదు నిమిషాల పాటు వేగించుకోవాలి.
ఈ మిశ్రమంలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బొమ్మిడాయిను వేసుకోవాలి. ఈ మసాలా అంతా చేప ముక్కలకు పట్టేలా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో చింతపండు పులుసు పోసి 15 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. బొమ్మిడాయిలు ఉడికిన తర్వాత దానిలో కరివేపాకు, కొత్తమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే వేడీ వేడీ బొమ్మిడాయిల పులుసు రెడీ.