బాంబే కోర్టులో ‘గంగూబాయి కథియావాడి’ టీమ్‌కు ఊరట

by Jakkula Samataha |
బాంబే కోర్టులో ‘గంగూబాయి కథియావాడి’ టీమ్‌కు ఊరట
X

దిశ, సినిమా : ఆలియా భట్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘గంగూబాయి కథియావాడి’ మూవీ టీమ్‌కు బాంబే కోర్టు తీర్పుతో ఊరట లభించింది. మూవీ స్టోరీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొద్ది రోజుల కిందట డైరెక్టర్‌, హీరోయిన్‌తో పాటు రచయిత హుస్సేన్ జైదిపై ముంబై సివిల్ కోర్టులో గంగూబాయి ఫ్యామిలీ మెంబర్స్ కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే కేసు విచారణలో భాగంగా గంగూబాయి కుటుంబ సభ్యులు సరైన ఆధారాలు సమర్పించలేకపోయారు. దీంతో ఆలియా భట్, ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తక రచయిత హుస్సేన్ జైదితో పాటు మూవీ టీమ్‌పై నమోదైన కేసులను తాజాగా బాంబే కోర్టు కొట్టివేసింది.

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా, జయంతిలాల్‌ గడాతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబైలోని కమతిపురాను శాసించిన లేడీ డాన్‌గా పేరున్న గంగూబాయి జీవితంపై హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సంజయ్. ఈ మూవీలో ఆలియా వ్యభిచార గృహ యజమానిగా, మాఫియా క్వీన్‌గా కనిపించబోతుంది. కొవిడ్ మహమ్మారి, గంగూబాయి కుటుంబ సభ్యుల కేసుల వల్ల కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు కేసులు కొట్టివేయడంతో ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకోనుంది. ‘గంగూబాయి కథియావాడి’ సినిమాలో కీలక పాత్ర పోషించే అజయ్ దేవగన్.. ఈ నెల చివర్లో షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం. ఈ చిత్రంలో హ్యుమా ఖురేషి స్పెషల్ రోల్ ప్లే చేస్తోందని తెలుస్తోంది.

Advertisement

Next Story