- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. సంచలన నిజాలు వెలుగులోకి..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఫిబ్రవరిలోనే ఈ కేసు నమోదు అవ్వగా.. పక్కా ఆధారాలతో సోమవారం రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఈ కేసు లోని కొన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. సినిమాలు, వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. ఆ తర్వాత వారితో బలవంతంగా అడల్ట్ చిత్రాలు నిర్మించి.. వాటిని కొన్ని యాప్‌ల ద్వారా వాటిని పోర్న్ విదేవులుగా మార్చి లండన్ లో విడుదల చేస్తున్నట్లు రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ పోర్న్ రాకెట్ మొత్తానికి రాజ్ కుండ్రనే సూత్రధారి అని పోలీసులు తెలిపారు.
యువతులను మోసం చేసి నగ్న వీడియోలను చిత్రీకరించి వాటిని వీట్రాన్స్‌ఫర్ ద్వారా విదేశాలకు పంపిస్తారు. వాటిని భారతీయ చట్టాల నుంచి తప్పించుకునేందుకు అక్కడి యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఒక్కో వీడియోకు రెండు లేదా మూడు లక్షలు వసులు చేస్తారు. ఈ తతంగమంతా కుంద్రా ఆఫీస్ అయిన ముంబైలోని వెస్ట్ మలాడ్‌లో ఉన్న మాద్ ఏరియా బిల్డింగ్‌లో షూటింగ్ చేసేవాళ్లని, అక్కడ పోలీసులు చేసిన తనిఖీల్లో అయిదుగురు దొరికారని అధికారులు తెలిపారు.
ఎలా బుక్కయ్యారు..
వెస్ట్ ముంబయిలోని ఒక బిల్డింగ్ లో నీలి చిత్రాలు తీసే ఒక ముఠాను ముంబయి ప్రాపర్టీ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అలా వారు అదుపులోకి తీసుకున్న తొమ్మిది మందిలో నటి కం మోడల్ గెహానా వశిష్ఠ్.. రోవా ఖాన్ ఉన్నారు. విదేశీ ఐపీ అడ్రస్‌ల ద్వారా పోర్న్ వీడియోలను అప్‌లోడ్ చేసేవాళ్లు. హాట్‌షాట్, న్యూఫ్లిక్స్, హాట్‌హిట్, ఎస్కేప్‌నౌ.టీవీ లాంటి అప్లికేషన్స్‌ను వాడేవారు. పోర్న్ వీడియోలు షూట్ చేసేందుకు వాడిన సుమారు 6 లక్షల విలువైన పరికరాలను పోలీసులు సీజ్ చేశారు. అంతేకాకుండా ఫిబ్రవరిలో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ పోర్న్ రాకెట్ బయటపడింది. అప్పటినుంచి అన్ని ఆధారాలను సేకరించామని, పక్క ఆధారాలతోనే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈజీ మనీ కోసం రాజ్ కుంద్రా ఇలాంటి అడ్డదారులు తొక్కారని, ఆయనతో పాటు పనిచేస్తున్న ఉమేశ్ కామత్ అనే డైరెక్టర్ ని, తన్వీర్ అనే వ్యక్తితో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
బిగ్ బ్రేకింగ్.. అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త అరెస్ట్