‘‘చంపుతామంటూ బాలీవుడ్ హీరోయిన్‌కి బెదిరింపు కాల్స్’’

by Anukaran |
‘‘చంపుతామంటూ బాలీవుడ్ హీరోయిన్‌కి బెదిరింపు కాల్స్’’
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన ‘లోఫర్’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ‘ఎం.ఎస్‌.ధోనీ’ ‘భాగీ-2’,3 వంటి చిత్రాల్లో నటించింది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వస్తోన్న ‘రాధే’ మూవీలోనూ నటించింది. ఈ చిత్రం వచ్చే రంజాన్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న దిశ..తరచూ ఫొటో షూట్‌లతో అభిమానులను పలుకరిస్తుంటోంది. తన ఫొటోలను సోషల్‌ మీడియాలో తరుచూగా పోస్టు చేస్తుంటుంది. కాగా, ముద్దుగుమ్మ తాజాగా ప్రమాదంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. దిశాపటానీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయట. ఫోన్‌ చేసి తనను చంపేస్తామని భయపెడుతున్నట్లు సమాచారం. అంతేగాక పోలీస్‌ స్టేషన్లకు కూడా కాల్స్‌ చేసి మీ అమ్మాయి(దిశా పటానీ) ఇక ఎవరూ రక్షించలేరని అంటున్నారట. ఈ కాల్స్‌ పాకిస్తాన్‌ నుంచి వస్తున్నట్లు, కాల్‌ చేసిన వ్యక్తి దిశను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్స్‌పై పోలీసులు దృష్టి పెట్టినట్లు, దీని వెనుక ఉన్న సూత్రధారిని పట్టుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. అసలు ఈ ఫోన్ కాల్స్ ఎవరు చేస్తున్నారు? తన ఫ్యాన్సే ఇలా చేస్తున్నారా? అనేది ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దిశా ప‌టానీ రీసెంట్‌గా మాల్దీవుల్లో దిగిన బికినీ ఫొటోల‌ను త‌న ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story