సరోజ్ జీ.. ఇక సెలవు

by Shyam |
సరోజ్ జీ.. ఇక సెలవు
X

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి.. సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందరో నటులకు గురువుగా నృత్య పాఠాలు నేర్పి.. ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ప్రోత్సహించిన తను ‘ఒక ఇన్‌స్టిట్యూషన్’ అని స్మరించుకున్నారు సినీ ప్రముఖులు. తన డ్యాన్స్.. ఇండస్ట్రీకి రిథమ్, గ్రేస్‌ను పరిచయం చేశాయన్నారు. సరోజ్ ఖాన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. సరోజ్ ఖాన్ తన మొదటి, నిజమైన గురువు అని తెలిపారు. ఫిల్మ్ డ్యాన్స్ ఎలా చేయాలో? గంటలు గంటలు నేర్పిందని చెప్పారు. ఇప్పటి వరకు తను కలిసిన వారిలో ప్రేమ, శ్రధ్ధ గల వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తనే అని తెలిపారు. ‘సరోజ్ జీ’ని ఎప్పటికీ మిస్ అవుతానన్న షారుఖ్.. అల్లాహ్ ఆమె ఆత్మను ఆశీర్వదించాలని కోరుకున్నాడు. తనను ప్రేమగా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

సరోజ్ ఖాన్ నాట్యం.. ఒక డిక్షనరీ లాంటిదని అభివర్ణించింది కాజోల్. తను నేర్పిన డ్యాన్స్ చాలా విధాలుగా ఉపయోగించానని తెలిపింది. తను చెప్పదలచుకున్న ప్రతీ విషయం తన ముఖం, బాడీ లాంగ్వేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఆమె అల్లరి, ఆప్యాయత, పనిపట్ల తనకున్న పరిపూర్ణ ప్రేమను చూడగలిగాను అన్నారు. మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా అన్న కాజోల్.. లవ్ యూ అంటూ వీడ్కోలు తెలిపింది.

సరోజ్‌ఖాన్ మృతి వార్తతో వినాశనానికి గురయ్యానని తెలిపింది మాధురీ దీక్షిత్. తన గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదన్న మాధురి.. తను మొదటి నుంచి నా ప్రయాణంలో భాగమయ్యారని తెలిపింది. డ్యాన్స్ మాత్రమే కాదు.. అంతకు మించిన జీవిత పాఠాలు తన నుంచి నేర్చుకున్నానంది. ఇది తనకు వ్యక్తిగత నష్టమని తెలిపిన మాధురి.. సరోజ్ జీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.

https://www.instagram.com/p/CCKsrQRnEHL/?igshid=1qvh04zuqmtj3

‘సరోజ్‌ఖాన్ సినీ ఇండస్ట్రీకి రిథమ్, స్టైల్, గ్రేస్ నేర్పించిన గురువు’ అన్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. అలాంటి గొప్ప వ్యక్తి ‘డాన్’ సినిమా విడుదలైనప్పుడు ఇచ్చిన కాంప్లిమెంట్స్ మరిచిపోలేనన్నారు. ఈ చిత్రంలోని ‘కైకే పాన్ బనారస్‌వాలా’ సాంగ్ థియేటర్‌లో చూసి.. ఆ పాట కోసమే రోజూ థియేటర్‌కు వెళ్తున్నానని చెప్పిందన్నారు బచ్చన్. ఆమె అంతగా డ్యాన్స్‌ను ఇష్టపడుతుందని.. ప్రతీ ఒక్కరినీ ప్రోత్సహిస్తుందని అన్నారు. ఆమె మరణంతో ఒక వారసత్వం ముగిసినా.. తన జీవితకాల సృజనాత్మకత, తను ఇండస్ట్రీకి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ డాక్యుమెంట్ చేయబడిందని అన్నారు. కానీ ఆమె మరణవార్తతో మనస్సు, మెదడు దుఖంతో, పశ్చాత్తాపంతో నిండిపోయాయని తెలిపారు బచ్చన్.

https://www.instagram.com/p/CCK5tM8BWew/?igshid=440l2q6ibkdk

సరోజ్‌ఖాన్ ఎప్పుడూ ఒకటి చెప్తుండే‌వారని తెలిపింది కరీనా కపూర్ ఖాన్. అడుగు కదపకపోతే కనీసం మొహం అయినా కదపాలని, డ్యాన్స్‌ను ఎంజాయ్ చేయాలని, మొహం మీద చిరునవ్వుతో పాటు కళ్ల ద్వారా కూడా నవ్వాలని చెప్పేవారంది. ఇలాంటి వ్యక్తులు మరెవరూ ఉండరు, ఉండలేరన్న కరీనా.. డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్ అనేది ఎప్పుడూ ఒకటి కాదని తనను ప్రేమించిన వ్యక్తులకు అర్థం అవుతుందన్నారు. మేము నృత్యం చేసేవరకు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం అన్న కరీనా.. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

https://www.instagram.com/p/CCKvjDRJcQs/?igshid=zk4ecz4tt3j

‘సరోజ్ జీ’తో చాలా సినిమాలు చేశానని గుర్తు చేసుకున్నారు నమ్రత శిరోద్కర్. తను ఒక డ్యాన్స్ ఇన్‌స్టిట్యూషన్ లాంటిదని అభివర్ణించారు. ఎమోషన్‌తో డ్యాన్స్‌ను మిళితం చేసిన కొద్ది మంది కొరియోగ్రఫర్లలో తనూ ఒకరని అన్నారు. తను మనతో డ్యాన్స్ చేయించినప్పుడు మనలోని మొత్తం స్త్రీని బయటకు తీసుకొస్తుందని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు మరింత శక్తి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

https://www.instagram.com/p/CCK_f0ujmUc/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story

Most Viewed