క్వారంటైన్… బాలీవుడ్ టాలెంట్ టైమ్

by Shyam |
క్వారంటైన్… బాలీవుడ్ టాలెంట్ టైమ్
X

క్వారంటైన్ పీరియడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ సెలబ్రిటీలు. కొందరు కిచెన్ కు అంకితమై తమలోని చెఫ్ ను నిద్రలేపగా… మరి కొందరు డాన్స్, టిక్ టాక్ లతో ఎంజాయ్ చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు, హీరోలు తమ పిల్లలతో ఎంచక్కా టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే తనలోని టాలెంట్ ను వెలికితీసి… అమ్మకు పిజ్జా చేసి పెట్టింది. చిన్నప్పుడు తమకు అమ్మ పిజ్జా చేసి పెట్టేదని ఇప్పుడు తనకు నా చేతులతో స్వయంగా చేసి పెట్టే సమయం, అదృష్టం దక్కిందని తెలుపుతూ పాక శాస్త్రంలో ప్రావీణ్యం అభిమానులకు కూడా షేర్ చేసింది. అంతే కాదు లాక్ డౌన్ సమయంలో తనకు ఇష్టమైన గిటార్ ను నేర్చుకుంటానని శపథం కూడా చేసింది.

అలియా భట్ కూడా క్వారంటైన్ సమయంలో కిచెన్ కి వెళ్తోందట. తనకు తెలిసిన రెసిపీస్ తయారు చేసి కుటుంబ సభ్యులకు సర్వ్ చేస్తోంది. ఈ పిక్ నెట్టింట వైరల్ అయిపోయింది. ఈ మధ్య ఫ్యామిలీ అనే షార్ట్ ఫిల్మ్ లో కనిపించిన అలియా… ఈ లఘు చిత్రాన్ని కూడా ఇంటి నుంచే చేసింది. మొత్తానికి క్వారంటెన్ పీరియడ్ ను బిజీగా ఉండేలా మార్చుకుంటుంది.

ఇక సీనియర్ హీరోయిన్ జుహి చావ్లా… అందరి కంటే భిన్నంగా ఆలోచించింది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో కొత్తగా మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెట్టింది. మీ ఇళ్లలోనూ ఈ ప్రయత్నం చేసి మొక్కలు పెంచాలని… పర్యావరణాన్ని కాపాడాలని కోరుతుంది.

సమీరా రెడ్డి… తల్లిగా పునర్జన్మ పొందాను అని చెప్పే సమీరా… ఇద్దరు పిల్లలతో ఎంచక్కా ఎంజాయ్ చేస్తోంది. తన పిల్లల్లో మరో చిన్నారిగా కలిసిపోయి తెగ ఎంజాయ్ చేస్తోంది. అత్త గారితో టిక్ టాక్ లు చేస్తూ మరింత ఆనందంగా ఉంది. లాక్ డౌన్ వల్ల కుటుంబీకులతో విలువైన, ఆరోగ్యకరమైన సమయాన్ని గడుపుతోంది.

శిల్పా శెట్టి…. యోగా భామ. యోగాతో పాటు కుకింగ్ లెసన్స్ కూడా చెప్తోంది. చక్కని ఆరోగ్యానికి వర్క్ ఔట్ తో పాటు మంచి ఆహారం తీసుకోవాలని సూచనలు ఇస్తూ కొన్ని వంటలు నేర్పిస్తుంది. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న శిల్పా… కొడుకు తనకు మసాజ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఇలాంటి హ్యాపీ మోమెంట్ రావడానికి కారణం లాక్ డౌన్ మాత్రమే అని తెలిపింది.

తాప్సీ పన్ను…. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. రోజుకో ఫోటోను షేర్ చేస్తూ అభిమానులను కూడా ఆనందంగా ఉంచుతున్న భామ… 2019లో రిలీజ్ అయిన సినిమాలను అన్ని చూసే ప్రయత్నంలో ఉంది. దీంతో పాటు బుక్స్ కూడా చదువుతూ… బిజీగా ఉంటోంది తాప్సీ. తెలుగు, తమిళంలో తన భాష ప్రావీణ్యాన్ని కూడా టెస్ట్ చేసుకుంటోంది.

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్… లాక్ డౌన్ కారణంగా ప్రతీ ఒక్కరికీ ఎలా మర్యాద ఇవ్వాలి? మన కోసం మనవాళ్లు ఎలా వెయిట్ చేస్తారు? వారిని ఎలా చూసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందట. చెల్లి ఖుషి, తండ్రి బోనీ కపూర్ తో విలువైన సమయాన్ని గడుపుతున్న జాన్వీ… లాక్ డౌన్ కాలంలో పెయింటింగ్, డాన్సింగ్ తో ఫ్రెండ్ షిప్ చేస్తోంది.
Tags :Bollywood, pooja Hegde, Taapsee, janhvi kapoor, Shilpa Shetty

Slug : Bollywood actresses in Quarentine period

Advertisement

Next Story

Most Viewed