- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హలీవుడ్‌లో.. బాలీవుడ్ బావుటా
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా క్రిస్టోఫర్ నోలన్ ‘టెనెట్’ సినిమా ఇండియాలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ‘ప్రియ’ పాత్రలో కనిపించిన బాలీవుడ్ అలనాటి నటి డింపుల్ కపాడియా తన నటనతో యావత్ సినీ అభిమానులను ఆకట్టుకుంది. అయితే గతంలోనూ పలువురు బాలీవుడ్ నటులు హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించారు. వారెవరో తెలుసుకుందాం.
పద్నాలుగేళ్లకే నటప్రస్థానాన్ని ప్రారంభించి, తను నటించిన తొలి రెండు చిత్రాల(బాబీ, సాగర్)కు ఫిల్మ్‌ఫేర్ అందుకున్న నటి డింపుల్ కపాడియా. 1980-90 కాలంలో అద్భుతమైన పాత్రలు పోషించి, బీటౌన్‌లో లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగిన డింపుల్.. ప్రస్తుతం 63 ఏళ్ల వయసులో హాలీవుడ్ అవకాశం అందుకుని అక్కడ కూడా తన నటచాతుర్యంతో ప్రశంసలందుకుంటోంది. సైన్స్ ఫిక్షన్ చిత్రాల మేటి దర్శకుడు క్రిస్టోఫర్ కూడా ‘డింపుల్’ నటనకు ఫిదా కావడంతో పాటు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. టెనెట్‌లోని ‘ప్రియ’ పాత్రకు డింపుల్ ప్రాణం పోసిందని కొనియాడాడు. అటు అక్షయ్ కూడా తన అత్తయ్యను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు డింపుల్ అల్లుడిగా గర్వపడుతున్నానని తెలిపాడు. ఒకే ఒక్క చిత్రంతో హాలీవుడ్ దర్శకులను తన వైపును తిప్పుకున్న డింపుల్ రాబోయే రోజుల్లో హాలీవుడ్‌లో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో వేచి చూడాలి. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలని సగటు అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
ఇక తన నటనతో మెప్పించి హలీవుడ్‌లో అవకాశాలతో పాటు ప్రశంసలు అందుకున్న భారతీయ నటుల్లో మొదటగా చెప్పుకోవాల్సింది దేశీ గర్ల్ ప్రియాంక చోప్రానే. ప్రస్తుతం గ్లోబల్ సెన్సేషన్‌గా మారిన ప్రియాంక.. అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘క్వాంటికో’తో హలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘బేవాచ్’ మూవీలో డ్వేన్ జాన్సన్, జాక్ ఎఫ్రాన్, అలెగ్జెండ్రా దద్దరియో వంటి పాపులర్ హలీవుడ్ యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పటి నుంచి ఎన్నో హలీవుడ్ చిత్రాల్లో అవకాశాలను అందుకుంటున్న ప్రియాం.., ప్రస్తుతం ‘మాట్రిక్స్ 4, టెస్ట్ ఫర్ యూ’ చిత్రాల్లో నటిస్తోంది.
భారతీయ నటుల్లో గుర్తించుకోదగ్గ మరో నటుడు ఇర్ఫాన్‌ఖాన్. 2020లో కేన్సర్‌తో మరణించిన ఇర్ఫాన్.. హలీవుడ్‌లోనూ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘ద లైఫ్ ఆఫ్ పై, ఇన్‌ఫెర్నో, ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్, జురాసిక్ వరల్డ్, ద నేమ్‌సేక్, ఏ మైటీ హార్ట్, స్లమ్‌డాగ్ మిలియనీర్, న్యూయార్క్’ తదితర చిత్రాల్లో నటించి శెభాష్ అనిపించుకున్నాడు.
అందంతో పాటు అభినయంలోనూ మేటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్.. ‘పింక్ పాంథర్ 2, బ్రైడ్ అండ్ ప్రిజ్యూడిస్, ద మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, ప్రోవోక్డ్, ద లాస్ట్ లీజియన్’ వంటి హలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక భారతీయ సినీపరిశ్రమకు దశాబ్దాలకు సేవలందిస్తున్న వెటరన్ యాక్టర్ అమితాబ్ కూడాత హలీవుడ్‌లో ‘ద గ్రేట్ గాట్స్‌బీ’ చిత్రంతో తన సత్తా చాటాడు. బాలీవుడ్ దివా దీపికా పదుకొనె, ఫ్రిదా పింటో, అనుపమ్ ఖేర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, అలీ ఫజల్, అనిల్ కపూర్, టబు, మల్లికా షెరావత్, షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, ఓంపురిలు వంటి బీ టౌన్ స్టార్లు సైతం హలీవుడ్‌లో రాణించి పేరు తెచ్చుకున్నారు.