నా కోసమే అన్నయ్య సినిమాలు చేయలేదు : బాబీ డియోల్

by Jakkula Samataha |
నా కోసమే అన్నయ్య సినిమాలు చేయలేదు : బాబీ డియోల్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ బర్త్‌డే సందర్భంగా వార్మ్ విషెస్ అందించారు బ్రదర్ బాబీ డియోల్. తన అన్నయ్య నాన్నలా చూసుకునే వారని, తన తొలి సినిమా ‘బర్సాత్’ కోసం సన్నీ ఏడాది పాటు సినిమాలు చేయడం మానేసి, తనతోనే ఉంటూ సినిమా సూపర్‌గా వచ్చేలా తగు జాగ్రత్తలు తీసుకున్నాడని తెలిపాడు. అన్నయ్యను నాన్న ఎలా చూసుకున్నాడో.. తను కూడా నన్ను అలాగే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడని చెప్పాడు.

తన ఫస్ట్ మూవీ షూటింగ్ బెంగళూరు, మైసూర్, ముంబై, మనాలి ప్రాంతాల్లో జరిగిందన్న బాబీ.. తన ఇంట్రో సీన్ అదిరిపోయే రేంజ్‌లో ఉండాలని అన్నయ్య ఫిల్మ్ మేకర్స్‌కు సూచించాడని తెలిపాడు. అలా ఇటలీలోని చిన్న టౌన్‌లో టైగర్‌తో ఫైటింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారని చెప్పాడు. తన క్యారెక్టర్‌కు మరింత ఇంటెన్సిటీ యాడ్ చేసేందుకు యూకేలోని అడవుల్లో గుర్రాలతో పరుగెత్తే షాట్స్ తీయాలని భావించారని.. ఆ సీన్ చేస్తున్న సమయంలోనే కాలు విరిగిందని చెప్పాడు. కానీ అప్పటికే సినిమా పూర్తి కావడంతో ఊపిరి పీల్చుకున్నామని గుర్తుచేసుకున్నాడు. ఇప్పటికీ తన కాలులో రాడ్ ఉందన్న బాబీ డియోల్.. ఆ సినిమా డబ్బింగ్ అండ్ మిక్సింగ్ ఇంగ్లాండ్‌లోనే జరిగిందని వెల్లడించాడు. ఎందుకంటే సన్నీ డియోల్ అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలని అన్నారని తెలిపాడు. కాగా ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి చాలా సినిమాల్లో మెప్పించారు కూడా.

Advertisement

Next Story