- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీసాలో సందేశం.. 95ఏళ్ల తర్వాత కూతురికి చేరిన లేఖ
దిశ, ఫీచర్స్ : నాగార్జున మూవీ ‘శివమణి’ గుర్తుండే ఉంటుంది. సముద్రపు ఒడ్డున దొరికిన సీసాలోని సందేశం ద్వారానే ఆ సినిమా కథ మొదలవుతుంది. అయితే ఈ సీసా సందేశాలేం కొత్త కానప్పటికీ.. ప్రపంచ యుద్ధ కాలంలోనే ఇవి తెరపైకి వచ్చాయి. నౌక మునిగిపోయే సమయంలో నావికులు, సైనికులు తమ సందేశాన్ని పేపర్లలో రాసి సీసాల్లో పెట్టి సంద్రంలో పడేసేవాళ్లు. కొంతకాలానికి ఆ సీసాల ద్వారానే ఏం జరిగిందో ప్రపంచానికి అసలు విషయం తెలిసేది. అయితే రకరకాల కారణాలతో జనాలు తమ మెసేజ్‌ను బాటిల్‌లో రాసి సముద్రంలో విసిరేస్తుంటారు. ఆ సందేశం గమ్యానికి చేరకపోయినా ఏనాటికో తీరం మాత్రం చేరతాయి. అలా బాటిల్ మెసేజ్ ద్వారా స్నేహితులైనవాళ్లు, కోల్పోయిన ఫ్యామిలీని తిరిగి కలుసుకున్నవాళ్లు ఉన్నారు. తాజాగా అలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది.
మిచిగాన్(యూఎస్)కు చెందిన బోట్ టూర్ కంపెనీ ‘నాటికల్ నార్త్ ఫ్యామిలీ అడ్వెంచర్స్’ యజమాని, స్కూబా డైవర్ జెన్నిఫర్ డౌకర్, నౌకాయాన పర్యటనలు నిర్వహిస్తుంది. ఆమె ప్రయాణంలో భాగంగా చెబోయ్‌గాన్ నదిలో స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు పాత ఫ్యాషన్ బాటిల్ ఆమె దృష్టిని ఆకర్షించింది. 10 అడుగుల లోతు నీటి అడుగుభాగానా ఆ బాటిల్‌ను తెరిచి చూస్తే అందులో ఓ లెటర్ ఉంది. అందులోని లేఖ కొంతభాగం నీటిలో తడిసింది. దాంతో స్థానిక మ్యూజియంలో పనిచేసే తన స్నేహితురాలి సూచనలతో దాన్ని ఆరబెట్టి లేఖను చదవగా.. అది1926లో మోరోస్ కుటుంబానికి చెందిన వ్యక్తి రాశారని తెలుసుకున్నారు. అయితే చెబోయ్‌గన్ సిటీలో మోరోస్‌లు నివసిస్తారని ఆచూకి తెలుసుకున్న డౌకర్.. ఆ లేఖ రాసిన వ్యక్తి సందేశాన్ని తమ వారికి చేరవేయాలనే ఉద్దేశంతో ఆ వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఊహించనివిధంగా వైరల్ అయినా పోస్టును లక్షకు పైగా నెటిజన్లు షేర్ చేయడంతో పాటు ఆ వ్యక్తిని కనుగొనేందుకు ప్రయత్నించారు. చివరకు ఆ లేఖ రాసిన వ్యక్తి కుటుంబం ఆచూకీ తెలుసుకొని, డౌకర్‌ను జార్జ్ మోరో కుమార్తె మిచెల్ ప్రైమౌ(74 ఏళ్లు)ను సంప్రదించారు.
ప్రైమౌ తన తండ్రి చేతిరాతను గుర్తించడంతో పాటు, తన తండ్రి పుట్టినరోజు నవంబర్‌లో ఉందని, అతను నోట్ రాసి నదిలో పడవేశాడని అప్పుడు తనకు 17 లేదా18 సంవత్సరాలు ఉండొచ్చని తెలిపింది. ఈ నోట్ తనకు మంచి జ్ఞాపకాలను తిరిగి తెచ్చిపెట్టిందని, ఫాదర్స్ డే వారాంతంలో ఇలా జరగడం చాలా సంతోషకరమని ప్రైమౌ పేర్కొంది. ఇక ఆ బాటిల్‌ను తిరిగి డౌకర్‌కే ఇవ్వడం సముచితమని భావించి తిరిగి ఇచ్చేసింది. ఇక చివరగా జార్జ్ మోర్1995లో మరణించగా.. డౌకర్ ఆ లేఖను ప్రదర్శనకు పెట్టడంతోపాటు జార్జ్ మోరో కథను సజీవంగా ఉంచడానికి ప్రణాళికలు వేస్తోంది.