- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు నెలల్లో మూడు ఎలక్ట్రిక్ కార్లు విడుదల చేయనున్న బీఎండబ్ల్యూ ఇండియా!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ భారత్‌లో తన ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున తీసుకురానున్నట్టు వెల్లడించింది. రాబోయే 6 నెలల్లో మూడు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నట్టు గురువారం తెలిపింది. ముందుగా ఫ్లాగ్‌షిప్ టెక్నాలజీతో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఎస్‌యూవీ 9ని వచ్చే నెలలో విడుదల చేయనున్నామని, తర్వాత 3 నెలల్లో పూర్తి ఎలక్ట్రిక్ మినీ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్‌ను తీసుకురానున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.
అనంతరం ఆరు నెలల్లోగా మరో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ సెడాన్ కారు బీఎండబ్ల్యూ ఐ4ని విడుదల చేయనున్నట్టు తెలిపింది. బీఎండబ్ల్యూ సంస్థ ఈ ఏడాదిలో దేశీయ మార్కెట్లోకి మొత్తం 25 మోడళ్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘భారత్‌లో ఈ ఏడాది మొదటి పది నెలల్లో మెరుగైన వృద్ధిని సాధించాం. ఈ నేపథ్యంలో మరింత వేగవంతంగా కొనసాగాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ మొబిలిటీని లక్ష్యంగా చేసుకున్నామని’ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ విక్రమ్ పవా చెప్పారు.
డిసెంబర్‌లో విడుదల కానున్న బీఎండబ్ల్యూ9 కేవలం 6.1 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల విడుదల వేగవంతం చేస్తున్న క్రమంలో భారత్‌లోని 35 నగరాల్లో ఉన్న కంపెనీ డీలర్ నెట్‌వర్క్‌లలో ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటు చేసినట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ అన్ని డీలర్‌షిప్‌ల వద్ద 50 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్‌లతో అమర్చి ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.