- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కునూరులో బ్లాక్ ఫంగస్ కలకలం
దిశ, ఏపీ బ్యూరో: కుక్కునూరు మండల కేంద్రంలో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు సోకినట్లు అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి. కుటుంబసభ్యులు అతనిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. ఆ వ్యక్తి కంటికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు తెలుస్తోంది. కాగా ఆ వ్యక్తి వారం రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితం కంటికి ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు.
ప.గోదావరి ఏజెన్సీని వణికిస్తున్న విషజ్వరాలు
కుక్కునూరు మండలంలో డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి లక్షణాలతో గల విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకు మండలంలో గల రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 156 జ్వరపీడితుల కేసులు నమోదు కాగా వాటిల్లో 2 మలేరియా, 10 డెంగ్యూ కేసులు నమోదయన్నట్లు వైద్యాధికారుల లెక్కల్లో వెల్లడిస్తున్నారు. కానీ మండలంలో జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. జ్వరాలు ప్రబులుతున్న వారిలో ఎక్కువ మంది భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, సత్తుపల్లి, విజయవాడ, రాజమండ్రి వంటి పట్టణ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్న వారు స్థానికంగా ఉన్న గ్రామీణ వైద్యులు వద్ద వైద్యం పొందుతున్నారు. జ్వరాలు లేని ఊర్లు లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కరోనా కాస్త తగ్గుముఖం పట్టినా మరోవైపు విషజ్వరాలు వ్యాప్తితో జనం బిక్కుబిక్కుమంటున్నారు. రెండు రోజుల క్రితం డెంగ్యూ లక్షణాల కారణంగా ఓ బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఎక్కువ మంది జ్వరపీడితుల్లో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నాయని పలువురు వాపోతున్నారు.
డిఎంహెచ్ఓ పర్యటన..
జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో కుక్కునూరు మండల కేంద్రంలో డిఎంహెచ్ఓ బి.భానునాయక్ పర్యటించారు. తొలుత స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సిబ్బందిని జ్వరాల పరిస్థితిపై ఆరా తీశారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నాయిని, సిబ్బంది రోగుల బ్లెడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారని తెలిపారు. పరీక్షల నిమిత్తం జంగారెడ్డిగూడెం, ఏలూరు పంపిస్తున్నామనిన్నారు. కాగా స్థానిక ల్యాబ్ ల్లో ఎటువంటి డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకూడదని, గ్రామీణ వైద్యులు వైద్యం చేసినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ మురళీకృష్ణ, వైద్యులు రాజీవ్, సునీల్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.