- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి షాక్.. ఆయన ప్రచారం చేయరాదు
దిశ, వెబ్ డెస్క్ : ఎన్నికల వేళ అసోంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ కీలక నేత హిమాంత బిష్వ శర్మపై ఎన్నిల కమిషన్(ఈసీ) నిషేధం విధించింది. రెండు రోజుల పాటు పార్టీ ప్రచారానికి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో శర్మ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తనపై ఎన్నికల సంఘం విధించిన నిషేదంపై బీజేపీ నేత హిమాంత బిశ్వ శర్మ గువహతి హైకోర్టును ఆశ్రయించారు. బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)చీఫ్ హగ్రామా మోహిలరీని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ద్వారా అక్రమంగా జైలుకు పంపిస్తానంటూ బీజేపీ నేత శర్మ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ బీపీఎఫ్ మిత్ర పక్షం కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత హిమాంత బిశ్వ శర్మ 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేదం విధించింది. కాగా ఈసీ నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ఈసీ నిర్ణయాన్ని గువహతి హైకోర్టులో సవాల్ చేస్తున్నట్టు తెలిపారు.