- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌లో ప్రలోభాలు పనికిరావు.. గెలిచేది వారేనని జోస్యం చెప్పిన మంత్రి
దిశ ప్రతినిధి,వరంగల్ : హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు టీఆర్ ఎస్ ప్రజలను అనేక ప్రలోభాలకు గురి చేస్తోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మద్యం, డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేస్తూ మభ్య పెట్టి ఓట్లు సాధించాలనుకుంటున్న ప్రజలు మాత్రం బీజేపీ వైపే చూస్తున్నారని అన్నారు. దుబ్బాకలో ఘన విజయం సాధించినట్లుగానే హుజురాబాద్‌లోనూ బీజేపీ జెండా ఎగురబోతోందని అన్నారు.
శనివారం హన్మకొండ హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో బీజేపీ నేతలపై టీఆర్ ఎస్ నేతలు దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. హుజురాబాద్ ఎన్నికల కోసం ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, అయితే ఇంకా ఎన్నో రోజులు ఈ పాలన సాగదని, వచ్చేది బీజేపీ పాలననేని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన ప్రజలంతా ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం నిర్విరామంగా పనిచేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందన్నారు. టీఆర్ఎస్ నాయకులు అనేక అబద్దాపు ప్రచారాలు చేస్తున్నారని, కేంద్రంపై నిందలు వేయడం లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కి ఓటు వేయని పక్షంలో సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తండ్రీ కొడుకుల, బావమరుదుల పాలన , మామా అల్లుళ్ల పాలన నుండి తెలంగాణను విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగితే రాష్ట్రానికి అంత ఆదాయం వస్తుందని, పెట్రో ధరల వల్ల రాష్ట్రానికి వచ్చే వాటా తగ్గించి ఓటు అడగండని అన్నారు. ఒక కేంద్రమంత్రినే అడ్డుకున్నారు.. ఈ రాష్ట్రంలో స్వేచ్చగా ఓటేసే పరిస్థితులే లేవని అన్నారు. కాంగ్రెస్ తో కలిసే ఖర్మ మాకు లేదు.. టీఆర్ఎస్ పార్టీ అధినేతనే కాంగ్రెస్ నుండి వచ్చారని గుర్తు చేశారు.