తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: డీకే అరుణ

by Sridhar Babu |
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: డీకే అరుణ
X

దిశ, హుజూర్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని, పార్టీకి పెరుగుతున్న ఆదరణకు రానున్న రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా హుజూర్ నగర్ ‌పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి గ్రామంలోని యువత అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రధాని నాయకత్వానికి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉందన్నారు. రాష్ట్రంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా.. మూడు రోజుల పాటు ప్రజల మధ్యలో‌ ఉంటారని, ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి‌ తీసుకెళ్తారని స్పష్టం చేశారు.

Advertisement

Next Story