- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరద సాయాన్ని బీజేపీ ఆపలేదు: బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ బహిరంగంగా విసిరిన సవాళ్లను టీఆర్ఎస్ పార్టీ స్వీకరించలేకపోయిందని చురకలు వేశారు. వరద సాయాన్ని భారతీయ జనతా పార్టీ ఆపినట్లు అయితే.. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు వచ్చి సీఎం కేసీఆర్ ప్రమాణం చేయాలని బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. దీని పై కేసీఆర్ సిద్ధంగా ఉన్నారో.. లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ వరద సాయాన్ని పెంచమనే చెప్పింది తప్పా.. నిలిపివేయామని ఎప్పుడూ చేప్పలేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ వద్ద డబ్బులు లేకనే వరద సాయాన్ని నిలిపివేశారని బండి సంజయ్ విమర్శలు చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు కాబట్టే.. ఎంఐఎం పార్టీతో పొత్తు కట్టారని బండి సంజయ్ అన్నారు. ఏకంగా తన సంతకాన్ని కూడా టీఆర్ఎస్ వాళ్లు ఫోర్జరీ చేస్తున్నారని ఆరోపించారు. ఫోర్జీరి చేసిన సంతకాలను విడుదల చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, మరికాసేపట్లోనే బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని బండి సంజయ్ వెల్లడించారు.