అమ్మవారికి మహిమలు ఉన్నాయి : బండి సంజయ్

by Shyam |
అమ్మవారికి మహిమలు ఉన్నాయి : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం సికింద్రబాద్ ఉజ్జయిని మహంఖాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహంకాళి దేవాలయం పవిత్రమైన ఆలయం అని, ఈ దేవాలయంలో శక్తి, మహిమలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వార్ధం కోసం కాకుండా అందరూ సమాజ హితం కోసం కృషి చేయాలని అన్నారు. హిందూ సమాజం బాగుండాలని అమ్మవారిని ప్రార్ధించానని అన్నారు. భారతీయులుగా పుట్టినందుకు ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రలోభాలకు లొంగకుండా, స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాల సూచించారు.

Advertisement

Next Story