తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కన్నుమూత

by Shyam |
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కన్నుమూత
X

దిశ, తాండూరు : బీజేపీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమనేత, రామజన్మభూమి పోరాట యోధుడు పి. బాల్ రెడ్డి కన్నుమూశారు. జిల్లాలోని యాలాల మండలం కొకట్ గ్రామానికి చెందిన బాల్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయను ఈరోజు మృతి చెందారు.

ఆయన మృతి పట్ల బంధుమిత్రులు పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాండూరు ప్రాంతంలో పార్టీలు, కులమతాలకు అతీతంగా సేవలు అందించిన బాల్ రెడ్డి మృతి చెందడం పార్టీకి తీరని లోటని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Advertisement

Next Story