పల్లెలకు పాకిన రాజేందర్ విజయం.. మొదలైన విజయోత్సవ ర్యాలీలు

by Aamani |   ( Updated:2021-11-02 06:54:11.0  )
పల్లెలకు పాకిన రాజేందర్ విజయం.. మొదలైన విజయోత్సవ ర్యాలీలు
X

దిశ, లోకేశ్వరం: హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. దాంతో లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు పల్లెల్లో భాజపా శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు నిర్వహించుకుంటున్నారు. లోకేశ్వరంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. హుజురాబాద్ నుండి టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, హుజురాబాద్ ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా బీజేపీకి పట్టం కట్టడం సంతోషదాయకం అని అన్నారు. అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ,భాజపా నాయకులు పాల గంగాధర్, రామచందర్ రావు, రాజశేఖర్ ,శ్రీనివాస్, సాయినాథ్ పటేల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story