- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖమ్మం కార్పొరేషన్‌పై ‘కమలం’ గురి..
దిశ, ఖమ్మం టౌన్ : రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో బీజేపీ పుంజుకుంటుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? అందుకోసం బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించిందా అంటే అవును అనే అనే చెప్తున్నారు ఖమ్మంలో బీజేపీ నాయకులు . 2019 తెలంగాణాలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన సత్తాను చాటి తెలంగాణలో అధికార పార్టీకు షాక్‌ను ఇచ్చింది. జిల్లాల వారీగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో గెలుపు బాటలు వేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నారు. కమలనాథులు జిల్లాలో దఫాలు పర్యటనలు చేసేందుకు పావులు కదువుతున్నారు.
ఖమ్మం జిల్లాలో బీజేపీ జెండాను ఎగర వేసేందుకు ప్రజల్లోకి వెళ్లేందకు సిద్ధం అవుతున్నారు. హైదరాబార్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తరహా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే తరహాలో వేళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా పర్యటనలో పలు మార్పులు సంభవించాయి. రెండు మూడు రోజుల నుంచి జిల్లాలో ఎక్కడ చూసిన బండి సంజయ్ చేసిన విమర్శలపై చర్చ జరుగుతుంది. రవాణా శాఖ మంత్రిపై బండి సంజయ్ చేసిన విమర్శశలు అధికార పార్టీ నేతలు ఆలోచనలో పడినట్లు కనిపిస్తొంది. ఖమ్మం జిల్లాకు మొదటి సారిగా జిల్లా వస్తున్న సమయంలో అధికార పార్టీ కొన్ని ప్రశ్నలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి ఇరుకాటంలో పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీ అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ ఘాటుగానే సమాధానమిచ్చారు. కానీ బండి అడిగిన ప్రశ్నలకు మాత్రం అధికార పార్టీ చెందిన ప్రజాప్రతినిధులు సమాధనం ఇవ్వలేకపోయారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆలోచనలు లేని విమర్శలు చేసి బోల్తా పడ్డారని తెలువుతున్నారు.
ఖమ్మం బల్దియా ఎన్నికల్లో సత్తాను చాటేందుకు..
ఖమ్మం జిల్లా ఉద్యమాల గడ్డ. చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి చర్రిత కలిగిన ఖమ్మం జిల్లాలో అనేక రాజకీయ మార్పులతో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ, ఇతరుల పార్టీల శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను గెలిపించిన ఘనత ఖమ్మం జిల్లాదే… రెండు సార్లు అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పట్టు సాధించుకోలేకపోయింది. కానీ కాషాయం మాత్రం జిల్లాలో తమ ప్రభావం చూపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఖమ్మం బల్దియా ఎన్నికల్లో సత్తాను చాటేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటి నుంచే డివిజన్ల వారీగా చాప కింద నీరులా వెళ్తుంది. ఇప్పటికే డివిజన్లలో బీజేపీ సానుభూతిపరులను కలిసి వారి సహాయంతో ముందుకు పోతుంది. ఖమ్మం నగరంలో ఇప్పటి వరకు చూడని బీజేపీ జెండాలను ఇంటి మందు కట్టిస్తున్నారు. నెల రోజుల నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యువతపై దృష్టిసారించారు. దాంతో పాటు కేంద్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులు, రామజన్మభూమిలో గుడి కోసం చేసిన త్యాగాలు, ఆర్టికల్ 370 రద్దు లాంటి సంచలన నిర్ణయాలు పై ఫోకస్ పెట్టారు. డివిజన్ల్‌లో బూత్ స్థాయి నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో వెళ్లినప్పుడు ఎక్కడ కూడా అధికార పార్టీలను విమర్శనలు చేయకుండా జాగ్రత్తలు పడుతున్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీను గట్టిగా ఢీ కొట్టేందుకు చర్యలు చేప్పడుతున్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకోలేదు, కానీ ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో సుమారు 10 నుంచి 15 డివిజన్లు గెలుచుకోవాలని తహతహలాడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలహీనపడడంతో టీఆర్ఎస్‌కు గట్టి ప్రతిపక్షం లేకపోవడంతో, ఈ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రజల్లో పార్టీ బలం పెంచాలని బీజేపీ చూస్తుంది.
ప్రణాళికలు సిద్ధం..
జిల్లాలో ధపాల వారిగా కాషాయ దళాలు పర్యటనలు చేసేందుకు ప్రణాళికులు సిద్ధం చేస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణలో దృష్టి సారించారు. దాంతో పాటు జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ డైరెక్షన్‌లో పర్యటనలు చేసి జిల్లాలో ప్రజల దృష్టి కాషాయంపై మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి దశలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన చేపట్టి సక్సెస్ అయ్యారు. దాంతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆరవింద్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, ఇంకా ఢిల్లీ నుంచి పెద్ద నాయకులను జిల్లాకు రప్పించేందుకు కార్యాచరణలు రూపొందిస్తున్నారు. వీరి పర్యటనలో జిల్లాలో అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వారు చేసిన తప్పిదాలను ప్రజల్లో వివరించేందుకు సిద్ధం ఆవుతున్నారు. జిల్లాలో అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యేలపై అసంతృప్త నేతలపై గురి పెట్టిన్నట్లు సమాచారం. జిల్లాలో వారు చేస్తున్న ఒంటెద్దు పోకడలను ఫోకస్ చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో పదవులు రాని వారు, ఓడిపోయిన నేతలను టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసంతృప్తిగా ఉన్న నేతలను దగ్గరకు తీసి వారికి భవిష్యత్తులో పార్టీ పరంగా మంచి పదవులు చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. దాంతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్లు ఆశించిన వాళ్లు, టికెట్లు దక్కని వాళ్లును తమ వైవు మళ్లించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం నగరంలో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ గురించి చర్చలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి కమలనాథులు ఖమ్మం జిల్లాలో చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్, విఫలమవుతారా అనేది వేచి చూడాల్సిందే.