- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ బస్సులో 4 సీట్లు ఖాళీ
దిశ, వెబ్ డెస్క్: బీజేపీలో ప్రస్తుతం ఈ విషయంపైనే హాట్ హాట్ గా టాపిక్ కొనసాగుతోంది. ప్రముఖ సీనియర్ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారంట. అయితే, ఈ విషయమై ముఖ్య నేతలు మాట్లాడుతూ.. ఆశావాహుల్లో కొందరికి మాత్రమే అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయని చెబుతున్నారు. అదేమిటో మీరే చూడండి.
బీజేపీ పార్లమెంటు బోర్డులో నాలుగు సీట్లు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో మరో నలుగురు బీజేపీ నేతలకు అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలో తన ప్రక్రియను ప్రారంభించింది. అయితే, ఈ విషయమై ముఖ్య నేతలు తమకు స్థానం కల్పించాలని రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు చేస్తున్నారు. అందులో ఎవరికి అవకాశం ఇవ్వాలో అన్న ఆలోచనపై పార్టీలో చర్చ కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ, పార్టీ పగ్గాలు మాత్రం అమిత్ షా చేతుల్లోనే ఉన్నాయంట. ఆయన చెప్పిందే పార్టీలో ఫైనలంట. అందుకే ఆయన ఈ అంశంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం. చూడాలి మరీ చివరకు ఎవరికి అవకాశం కల్పిస్తారో అనేది.