అది ప్రధాని నరేంద్ర మోడీ కల

by srinivas |
అది ప్రధాని నరేంద్ర మోడీ కల
X

దిశ, వెబ్‌డెస్క్: 2022 నాటికి అందరికీ ఇల్లు ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ కల అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న ఇళకు గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ అని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హౌసింగ్ అని పేర్లు పెడుతున్నారని విమర్శించారు. పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వాలని ఉంటే వాటిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇళ్లు కేటాయించిన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు ఇవ్వాలని తెలియజేశారు. డీడీలు కట్టించుకొని, సర్వేలు జరిపి ఇచ్చిన ఇళ్లను రద్దు చేయడం దగా, మోసంగా పరిగణిస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story