అన్నీ అప్పుల లెక్కలే.. బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్

by Shyam |
BJP MLAs, raghunandan rao, rajasingh
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం అప్పులు తెచ్చిన లెక్కలే ఉన్నాయని, బడ్జెట్లో ఎక్కడా ప్రజా ఆకాంక్ష ప్రతిబింభించలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం సహచర ఎమ్మెల్యే రాజా సింగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గణంకాలే గొప్పగా ఉన్నాయని, 2021-22 బడ్జెట్‌ను చూస్తుంటే శుష్క ప్రియాలు.. శూన్య హస్తాల మాదిరిగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో ప్రభుత్వం రూ 45,509 కోట్లను అప్పులు తెచ్చిన లెక్కలనే తిరిగి చూపించడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఉస్మానియా యూనివర్సిటీని ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని, బడ్జెట్‌లో ఓయూకు ఒక్క రూపాయి కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో బస్తీ దవాఖానాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆసుపత్రిల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed