దాడులు చేయడానికి.. మేమూ సిద్ధంగా ఉన్నాం

by Shyam |
దాడులు చేయడానికి.. మేమూ సిద్ధంగా ఉన్నాం
X

దిశ, సంగారెడ్డి: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై వరంగల్ జిల్లాలో జరిగిన దాడిని నిరసిస్తూ.. హత్నూర మండల శాఖ ఆధ్వర్యంలో కాసాల దౌల్తాబాద్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు అక్రమాలను బయట పెడుతున్న ఎంపీపై దాడి చేయడం సిగ్గుచేటని, దాడులకు ప్రతి దాడులు సమాధానం అయితే సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. మండలానికి వచ్చే ఎమ్మెల్యే, మంత్రులపై కూడా దాడికి దిగుతామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed