ఆయన మరణం దేశానికి తీరని లోటు: జ్ఞానేంద్ర ప్రసాద్

by Shyam |
ఆయన మరణం దేశానికి తీరని లోటు: జ్ఞానేంద్ర ప్రసాద్
X

దిశ, మియాపూర్: భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అకాల మరణం దేశానికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. భారత తొలి సీడీఎస్ రంగంలో అత్యంత శక్తివంతమైన సైనిక అధికారిగా గుర్తింపు పొందిన బిపిన్ రావత్ అకాల మరణం భారత దేశానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్ రావు , కోటేశ్వరరావు , కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ రెడ్డి , సభ్యులు వెంకటరెడ్డి , ప్రసాద్ ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story